ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు బొప్పాయి పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే పపైన్ ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరచి, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే, బరువు అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. బొప్పాయిలోని పొటాషియం రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.































