ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎప్పుడైతే బాహుబలి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కడమే కాకుండా రెండు భాగాలుగా విడుదల అయ్యిందో.. అప్పటినుంచి వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు విడుదలవుతున్నాయి.
భాషతో సంబంధం లేకుండా.. స్టార్ స్టేటస్ తో పని లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తమ సినిమాను రిలీజ్ చేయాలని తాపత్రయ పడుతున్నారు. అందులో భాగంగానే పలు భాషలలో డబ్బింగ్ చేస్తూ.. రిలీజ్ చేస్తూ మంచి ఆదరణ కూడా పొందుతున్నారు. అలా పాన్ ఇండియా మార్కెట్ దక్కించుకొని.. ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ టాప్ 10 జాబితాలో చేరిన ఆ హీరోలు ఎవరు? టాలీవుడ్ నుంచి ఎవరు ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు? ఎవరి స్థానం ఎంత ? అనే విషయం వైరల్ గా మారుతోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల జాబితాలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఈయన అట్లీ దర్శకత్వంలో వస్తున్న తన 22వ చిత్రానికి ఏకంగా రూ.180 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
రెండవ జాబితాలో రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచారు. ఈయన 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు.
మూడవ స్థానంలో బాలీవుడ్ బాద్ షా, కింగ్ షారుక్ ఖాన్ నిలిచారు. ఈయన 135 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ మూడవ స్థానంలో నిలిచారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఆయన నటిస్తున్న జననాయగన్ సినిమా కోసం 125 కోట్లు తీసుకుంటున్నారట. ఈ జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచారు.
ఐదవ స్థానంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిలవగా.. రూ.110 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ రూ.110 కోట్లు తీసుకుంటూ ఆరవ స్థానంలో నిలిచారు.
గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న రామ్ చరణ్ రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తో ఏడవ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఈయన పెద్ది సినిమాలో నటిస్తున్నారు.
శాండిల్ వుడ్ హీరో యష్ రూ.85 కోట్ల రెమ్యూనరేషన్తో ఎనిమిదవ స్థానంలో నిలిచారు. ఈయన టాక్సిక్ అనే సినిమాతో పాటు హిందీ రామాయణం సినిమాలో రావణ పాత్ర పోషిస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రూ.75 కోట్ల రెమ్యూనరేషన్ తో 9వ స్థానంలో నిలిచారు . ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ రూ.60 కోట్ల రెమ్యూనరేషన్ తో పదవ స్థానంలో నిలిచారు.
ఇలా వీరంతా కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలుగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
































