ఓకే గదిలో 5వేల టన్నుల బంగారు కడ్డీలు.. 63 లక్షల కోట్ల పై మాటే.. ఎక్కడో తెలుసా?

 మధ్యకాలంలో బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో మరొకవైపు శాస్త్రవేత్తలు కూడా బంగారు గనులు ఎక్కడెక్కడ ఉన్నాయో అని పరిశీలించి మరీ తవ్వకాలు మొదలు పెడుతున్నారు.


ఇప్పటికే మన భారతదేశంలో ఎన్నో బంగారు నిక్షేపాలు ఉన్న గనులు బయటపడగా.. ఇప్పుడు మాత్రం భూగర్భంలో బంగారంతో నిండిన ఒక రహస్య గది గురించి తెలిసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. ముఖ్యంగా ఇందులో 5 వేల టన్నుల బంగారు కడ్డీలు లభించడమే కాకుండా దీని విలువ అక్షరాల 63 లక్షల కోట్ల పై మాటే అని తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారాష్ట్ర చేస్తున్నారు .మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఈ బంగారంతో నిండిన గది ఎక్కడో కాదు లండన్ మహానగరంలోని థ్రెడ్ నీడిల్ స్ట్రీట్ లో ఉంది.. ప్రపంచంలోని ఐదో వంతు బంగారం కడ్డీలు ఇటుకల రూపంలో ఈ వీధిలో కొలువై ఉన్నాయి. నిత్యం ఎన్నో బస్సులు, కార్లు, బైకులు దీనిమీద నుంచే పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా నగరవాసులు కూడా ఈ విలువైన నిధి నిక్షేపాలపై అటు ఇటు తిరుగుతున్నారు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా అసలు విషయం తెలిస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు. విషయంలోకి వెళ్తే.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ భూగర్భంలో భద్రంగా దాచిన బంగారమే ఇదంతా.. భూమి లోపల నిర్మించిన ఈ వాల్ట్ ప్రపంచంలోనే అత్యంత భద్రమైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తర్వాత ఎక్కువ బంగారు నిలువలు ఉన్న రెండో అతిపెద్ద స్వర్ణాగారం గా పేరు దక్కించుకుంది.

ఈ గదిలో ఉండే బంగారు బిస్కెట్ల విలువ విషయానికి వస్తే.. నాలుగు లక్షల బంగారు కడ్డీలు ఉన్నాయని.. ఒక్కొక్క కడ్డీ బరువు 12.5 కేజీలు ఉంటుందని సమాచారం. అంతేకాదు ఈ బంగారం బరువు సుమారుగా 5 టన్నులకు పైగానే ఉంటుందని.. దీని విలువ 63 లక్షల కోట్ల పై మాటే అని తెలుస్తోంది. ఇకపోతే ఈ బంగారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయానికి వస్తే 94% ప్రపంచంలోని 30కి పైగా దేశాల కేంద్ర బ్యాంకులు, పెద్దపెద్ద సంస్థలే ఇక్కడ దాచిపెట్టాయి. ఇక లండన్ కేవలం ఆరు శాతం బంగారాన్ని మాత్రమే ఇక్కడ దాచి పెట్టింది.

సుదీర్ఘకాలంగా ప్రపంచ మార్కెట్ కు కేంద్రంగా మారిన లండన్ రాజకీయ స్థిరత్వం కారణంగానే అనేక దేశాలు తమ బంగారాన్ని ఇక్కడ సురక్షితంగా దాచుకుంటున్నాయి. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దొంగలు డ్రిల్ చేసి లోపలికి రావడానికి కూడా వీలులేని విధంగా వాల్ట్ గోడలను భద్రంగా నిర్మించారు దృఢమైన లోహాలతో వీటి తలుపులు రూపొందించడం జరిగింది. ఈ బ్యాంకు చరిత్రలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా దొంగతనం జరగలేదు. ఏది ఏమైనా ఈ బంగారు నిక్షేపాలు ఉన్న గది అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.