ఈ గింజలతో ఇలా చేస్తే తెల్లజుట్టు నల్లగా మారటం ఖాయం..తెల్ల జుట్టును కప్పేయడానికి చాలామంది కెమికల్ డైలను ఉపయోగిస్తారు. కానీ ఇంట్లోనే నల్ల నువ్వులతో సహజ రంగు తయారు చేసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు రావు.
ఇది తయారు చేయడం కూడా చాలా సులభం.
తలలో తెల్ల వెంట్రుకలు వచ్చినప్పుడు బయటకు వెళ్లడానికి ఇబ్బంది పడతారు. యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని వెంట్రుకలు తెలుపు, కొన్ని నలుపు ఉంటే ‘సాల్ట్ అండ్ పెప్పర్’ లుక్ వస్తుంది. ఇది అందరికీ నచ్చకపోవచ్చు. అందుకే జుట్టుకు రంగు వేస్తారు. మార్కెట్‌లో దొరికే డైలన్నీ రసాయనాలతో నిండి ఉంటాయి. వీటిని తరచూ వాడితే జుట్టు దెబ్బతింటుంది, సహజ రంగు కూడా పోతుంది. కాబట్టి ఇంట్లోనే నల్ల నువ్వులతో రంగు తయారు చేసుకోవచ్చు.
నల్ల జుట్టు రంగు కోసం 2 టీస్పూన్ల నల్ల నువ్వులు తీసుకోండి. నువ్వుల నూనె, మట్టి దీపం, దూది, కొబ్బరి నూనె కూడా సిద్ధం చేసుకోండి.దూదిలో నల్ల నువ్వులు నింపి, దీపపు వత్తుల్లా చుట్టండి. వీటిని మట్టి ప్రమిదలో ఉంచి వెలిగించండి. మట్టి దీపాన్ని పెద్ద గిన్నెతో బోర్లించి కప్పండి. మంట నుండి వచ్చే పొగ గిన్నెకు తగిలి నల్ల బూడిదగా మారుతుంది. దీపాలు ఆరిపోయాక ఆ మసిని సేకరించి చిన్న ప్లేట్‌లో పెట్టండి. ఇందులో కొబ్బరి నూనె కలిపి పేస్ట్‌లా చేసి తెల్ల జుట్టుకు అప్లై చేయండి. అంతే!
ఈ సహజ రంగు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రావు. ఖర్చు కూడా చాలా తక్కువ. వారానికి 2-3 సార్లు అప్లై చేస్తే కొంత కాలంలో జుట్టు సహజంగా నల్లగా కనిపిస్తుంది. తెల్ల నువ్వులతో చేయవద్దు – నల్ల నువ్వులతోనే సరైన ఫలితం వస్తుంది.
నల్ల నువ్వులు జుట్టును నల్లగా, బలంగా మార్చడమే కాకుండా ఎదుగుదలకు కూడా సహాయపడతాయి. వీటిలో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలోనూ నల్ల నువ్వులకు ప్రాధాన్యత ఎక్కువ!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే.
































