35 ఏళ్ల బ్యానర్.. 20 ఏళ్ల గ్యాప్.. చరిత్రలో నిలిచే సినిమాకు రెడీ.

RRR తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా లాక్ చేసుకున్నాడు. ఈ కాంబినేషన్ గురించి ఎన్నో ఏళ్లుగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నా ఫైనల్ గా శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా లాకైంది.


అంతేకాదు సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతుంది. సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయకుండానే సెట్స్ మీదకు వెళ్లిన SSMB 29 ప్రాజెక్టు అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. అది రాజమౌళి సినిమా కాబట్టి ఆయన సినిమా తీసే లెక్కే కాదు ప్రమోషన్స్ కి ఒక లెక్క ఉంటుందని సైలెంట్ అయ్యారు. గ్లోబ్ త్రొట్టర్ మూవీగా SSMB 29 సినిమా నుంచి ఈ నెల 15న ఒక గ్లింప్స్ రాబోతుంది.

ఈ సంస్థలో వచ్చిన హిట్ సినిమాలు ఏంటి..?

ఐతే అసలు శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ ఎవరిది.. ఈ బ్యానర్ లోనే మహేష్, రాజమౌళి సినిమా ఎందుకు చేస్తున్నారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. శ్రీ దుర్గా ఆర్ట్స్ చరిత్ర ఇప్పటిది కాదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన హిస్టరీ ఈ బ్యానర్ కి ఉంది. 34 ఏళ్ల క్రితమే అంటే 1991 లోనే క్షణ క్షణం సినిమాతో శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కె.ఎల్ నారాయణ నిర్మాతగా సినిమాలు తీయడం మొదలు పెట్టారు. క్షణ క్షణం సూపర్ హిట్ అవ్వడంతో హలో బ్రదర్ సినిమా తీసి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు కె.ఎల్ నారాయణ.

క్షణ క్షణం వెంకటేష్ హీరోగా చేస్తే 1994లో హలో బ్రదర్ నాగార్జున చేశారు. ఆ తర్వాత వెంకటేష్ తో మళ్లీ 1996 లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా చేశారు నారాయణ. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత జగపతి బాబుతో 1997 లో దొంగాట సినిమా చేశారు కె.ఎల్ నారాయణ. ఐతే ఆ సినిమా మాత్రం ఆశించిన రిజల్ట్ అందుకోలేదు. మళ్లీ 2002 లో నాగార్జునతోనే సంతోషం సినిమా చేశారు. అది సూపర్ హిట్ అయ్యింది.

శ్రీ దుర్గా ఆర్ట్స్ చివరి సినిమా ఏంటి..?

2003లో తరుణ్ తో నిన్నే ఇష్టపడ్డాను చేయగా అది నిరాశపరచింది. ఫైనల్ గా 2006 లో ఎన్ టీ ఆర్ తో రాఖి సినిమా చేశారు కె.ఎల్ నారాయణ. ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.. కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కిన రాఖీ సినిమా కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ అందుకుంది.

2006 తర్వాత నారాయణ సినిమాలు తీయలేదు. ఐతే అప్పటికే వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న రాజమౌళితో సినిమాకు అడ్వాన్స్ ఇచ్చారు నారాయణ. ఇటు మహేష్ కి కూడా సినిమా చేసేందుకు కొంత అడ్వాన్స్ గా ఇచ్చారు. ఐతే రాజమౌళి, మహేష్ కాంబో సెట్ చేస్తూ దాదాపు 20 ఏళ్ల గ్యాప్ తర్వాత కె.ఎల్ నారాయణ సినిమా చేస్తున్నారు.

రాజమౌళి గ్రాండియర్.. మహేష్ ఇంటెన్స్ యాక్టింగ్..

చేసిన సినిమాలు తక్కువే అయినా 35 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బ్యానర్లో ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఐతే ఈసారి రాబోతున్న ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమా తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని అనిపిస్తుంది. రాజమౌళి గ్రాండియర్.. మహేష్ ఇంటెన్స్ యాక్టింగ్.. ప్రియాంక చోప్రా అందాలు.. పృథ్వీరాజ్ విలనిజం ఇలా ప్రతి ఒక్క అంశం అంచనాలను మించి ఉండేలా కనిపిస్తున్నాయి.

ఇక రిలీజైన SSMB 29 కుంభ ఫస్ట్ లుక్ పై ఆడియన్స్ రియాక్షన్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. ఈ నెల 15న గ్లింప్స్ తోనే సినిమా ఎలా ఉండబోతుంది అన్నది శాంపిల్ చూపించబోతున్నాడు జక్కన్న. గ్లోబ్ త్రొట్టర్ గా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో వారణాసికి లింక్ చేస్తూ రాజమౌళి మహేష్ మైథాలజీ కూడా టచ్ చేస్తున్నారని అంటున్నారు. సినిమాపై ప్రతి అప్డేట్ అది ఎలాంటి న్యూస్ అయినా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మరి ఎస్.ఎస్.ఎం.బి 29 టీజర్ తోనే బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కా అని సిగ్నల్స్ ఇస్తారేమో చూడాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.