యాక్టివ్ ఇన్కమ్ అంటే మీరు మీ పని లేదా వ్యాపారం నుంచి నేరుగా కష్టపడి సంపాదించేది. పాసివ్ ఇన్కమ్ అంటే ఒకసారి కష్టపడినా కూడా దానినుంచి నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది.
పాసివ్ ఇన్కమ్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. ఇది మీకు స్వేచ్ఛను ఇస్తుంది.
అంటే మీ డబ్బు మీ కోసం పని చేస్తుంది. యాక్టివ్ ఆదాయంలో మీ సంపాదన సమయం, శ్రమపై ఆధారపడి ఉంటుంది. కానీ పాసివ్ ఆదాయంలో ఇది ఉండదు. మీరు ఏమి చేయకుండా కూడా సంపాదించవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ పాసివ్ ఇన్కమ్ దేని ద్వారా పొందవచ్చు?
దీనికి చాలా మార్గాలు ఉన్నాయి. కాని సరైన మార్గాన్ని ఎంచుకోవడం ముఖ్యం. పాసివ్ ఆదాయాన్ని పొందడానికి ఐదు బెస్ట్ మార్గాలు ఏంటో చూసేద్దాం. వాటిలో మొదటిది ఆస్తిని అద్దెకు ఇవ్వడం. ఇది పాసివ్ ఆదాయానికి పురాతనమైన, నమ్మదగిన మార్గం. ఇల్లు, దుకాణం లేదా కార్యాలయ స్థలాన్ని కొనుగోలు చేసి అద్దెకు ఇవ్వడం ద్వారా ప్రతి నెలా స్థిరమైన ఆదాయం వస్తుంది.
స్టాక్ మార్కెట్లో క్రమం తప్పకుండా డివిడెండ్లను అందించే అనేక షేర్లు ఉన్నాయి. ఒకసారి సరైన కంపెనీలో పెట్టుబడి పెడితే.. షేర్లను అమ్మకుండానే ప్రతి సంవత్సరం ఆదాయం పొందవచ్చు. రిస్క్‌ను అర్థం చేసుకుని మార్కెట్‌ను గమనించేవారికి ఈ పద్ధతి మంచిది.
మీరు ఏదైనా సబ్జెక్ట్ గురించి మంచి పరిజ్ఞానం కలిగి ఉంటే.. దానిని కోర్సు లేదా ఈబుక్‌గా మార్చవచ్చు. కంటెంట్ ఒకసారి సిద్ధమైన తర్వాత.. దానిని మీరు పదేపదే అమ్మవచ్చు. ప్రతి కొత్త అమ్మకం మీకు అదనపు ఆదాయాన్ని తెస్తుంది. అది కూడా రోజువారీ శ్రమ లేకుండా.
బ్లాగ్, వెబ్సైట్ లేదా సోషల్ మీడియా ద్వారా ఇతరుల ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా కమీషన్ సంపాదించడం నేటి అత్యంత ప్రజాదరణ పొందిన మార్గం. సరైన బ్రాండ్‌తో కలిసి పనిచేయడం ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. కంటెంట్‌ను తయారు చేసి ప్రకటనలు, స్పాన్సర్షిప్ లేదా సభ్యత్వాల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు.



































