నవంబర్ 12వ తేదీ బుధవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,27,530 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.
1,16,150 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,58,511 పలుకుతోంది. పసిడి ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా పెరిగాయి. బంగారం ధరలు గడిచిన మూడు రోజులుగా గమనించినట్లయితే వరుసగా పెరగడం చూడవచ్చు. ముఖ్యంగా బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లలో మార్పులే కారణం అని చెప్పవచ్చు. అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర మరో సారి 4000 డాలర్లు దాటింది.
బంగారం ధరలు మళ్ళీ మూడు వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర 4118 డాలర్లకు చేరుకుంది. గతంలో ఇది 4000 డాలర్ల దిగువన ట్రేడ్ అయింది. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ కారణంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మళ్లీ బంగారం వైపు తరలిస్తున్నారు. ఈ కారణంగా ఒకసారిగా పసిడి ధరలు పెరగడం గమనించవచ్చు. సీఎన్‌బీసీ బిజినెస్ పోర్టల్ కథనం ప్రకారం కిట్కో మెటల్స్ విశ్లేషకుడు జిమ్ వైకాఫ్ మాట్లాడుతూ బలహీనమైన ఆర్థిక డేటా కారణంగా, డిసెంబర్లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గించే అవకాశం పెంచిందని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా సేఫ్ పెట్టుబడిగా భావించే బంగారం వెండి వాటి ఆస్తులకు మళ్లీ డిమాండ్ పెరిగి ధరలు పెరిగాయని పేర్కొన్నారు.
అమెరికా చరిత్రలోనే అత్యంత దీర్ఘకాలిక షట్ డౌన్ నడుస్తోంది. ఈ కారణంగా అమెరికాలో ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం వంటి కీలక డేటా అందుబాటులో లేకుండా పోయింది. అయితే కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు గణాంకాల ప్రకారం అమెరికాలో అక్టోబర్ నెలలో ఉద్యోగాల సంఖ్య తగ్గినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం నష్టాల్లో అడుగుపెట్టాయి. ఫలితంగా బంగారం ధరలు పెరగడం చూడవచ్చు. దీనికి తోడు డాలర్ విలువ కూడా తగ్గడం ప్రారంభించింది దీంతో బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. ఇదిలా ఉంటే స్విస్ బ్యాంక్ అంచనా ప్రకారం బంగారం ధర భవిష్యత్తులో 4700 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.
మరోవైపు బంగారం ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా గోల్డ్ ఈటీఎఫ్ స్కీములకు మళ్లీ డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Disclaimer: పై కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు అన్ని పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సూచిస్తోంది.
































