ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్ తన X ఖాతాలో పోస్ట్ చేసిన ట్వీట్ పెట్టుబడులు, పరిశ్రమల వర్గాల్లో ఆసక్తి కలిగించింది.
“2019లో కొత్త ప్రాజెక్టులు ఆపిన ఒక కంపెనీ, నవంబర్ 13, 2025 ఏపీలో ‘ తుఫాన్’లా తిరిగి వస్తోంది. ఇది ఎవరు?? 9 AMకు గ్రాండ్ అనవీల్! ట్యూన్‌లో ఉండండి!! అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ గామారింది.
2019లో YSRCP ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్నికల ప్రకటనలు, భూమి సమస్యలు, పాలసీ మార్పుల వల్ల అనేక పెద్ద కంపెనీలు కొత్త ప్రాజెక్టులు ఆపేశాయి. ఇప్పుడు TDP-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం వేగవంతమైన సౌకర్యాలు, ఇన్సెంటివ్స్ ఇస్తూ పెట్టుబడులు తిరిగి తీసుకురువడానికి ప్రయత్నిస్తోంది. ఇది ఏ సంస్థ అన్నదానిపై లోకేష్ క్లూ ఇవ్వలేదు.
విశాఖలో 13, 14 తేదీల్లో జరగనున్న ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహాల్లో భాగంగా నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు.అక్కడ మీడియాతో మాట్లాడారు. పెట్టుబడులకు వేగవంతమైన సౌకర్యాల కల్పన కీలకం.. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఏపీని ఎంచుకున్నాయన్నారు. ఐటీ, తయారీ, సేవలు, పర్యాటక రంగాలు చాలా కీలకం.. లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారనన్నారు. పరిశ్రమలు ఏపీని ఎంచుకోవడానికి 3 కీలక కారణాలున్నాయని. మంచి సంబంధాలు నెలకొల్లుతున్నందునే పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తోంది.. ఏపీలో మాత్రం డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ నడుస్తోందని గుర్తు చేశారు. నమో అంటే నరేంద్ర మోదీ మాత్రమే కాదు.. నాయుడు మరియు మోదీ కలయిక అన్నారు.
వికసిత్ భారత్ విజన్ 2047 మేరకు ముందుకు సాగుతున్నాం.. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా సాగుతున్నాం. స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని ప్రగతి దిశగా పయనిస్తున్నాం.. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతోందని తెలిపారు. సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశమిచ్చిన సీఐఐకి ధన్యవాదాలు.. సీఐఐ, చంద్రబాబు మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలున్నాయన్నారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణలో దాదాపు 50 శాతం సీఐఐ సదస్సులు జరిగాయన్నారు.
విశాఖపట్నంలో నవంబర్ 14-15న జరిగే CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో 410 MoUs ఆమోదం కోసం సిద్ధంగా ఉన్నాయని లోకేష్ ప్రకటించారు. ఇవి $100 బిలియన్ల (రూ. 9.8 లక్షల కోట్లు) పెట్టుబడులు తీసుకువచ్చి, 7 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాయని అంచనా. 45 దేశాల నుంచి 300 మంది విదేశీ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటారు.



































