ప్రకృతి మనకు అందించిన అమూల్యమైన వరాల్లో యాలకులు (Cardamom) ఒకటి. దీన్ని కేవలం వంటకాలకు సువాసన చేర్చే మసాలా దినుసుగా భావించడం, దాని సామర్థ్యాన్ని తగ్గించి చూడడమే.
ఇది నిజంగా ‘సుగంధ ద్రవ్యాల రాణి’. రోజుకు ఒక్క యాలక్కాయను నమలడం లేదా చార్లో వేసుకొని తాగడం వంటి చిన్న అలవాటు, మీ ఆరోగ్యానికి పెద్ద లాభాలు ఇస్తుంది. మరి ఆ లాభాలు ఏంటో తెలుసుకుందాం.
- తిన్న ఆహారం జీర్ణం కాక కడుపు భారంగా ఉన్నప్పుడు యాలక్కాయ నమిలితే మంచి ఫలితం ఉంటుంది. ఇది పిత్తరసం స్రావాన్ని ప్రేరేపించి, ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
గ్యాస్, అజీర్తి, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలకు ఇది సహజమైన పరిష్కారం.
- యాలకుల్లో సమృద్ధిగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది సీజనల్ అలర్జీలు, జలుబు, ఫ్లూ వంటి వాటి నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
- యాలకుల్లోని ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ (LDL) చేరకుండా కాపాడతాయి. రక్తప్రవాహాన్ని మెరుగుపరిచి, రక్తనష్టాన్ని నియంత్రించడంలో సహాయకరిగా ఉంటాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- బరువు తగ్గాలనుకునే వారికి యాలకులు మంచి ఔషధంగా పనిచేస్తాయి.
ఇవి శరీర మెటబాలిజం రేటును పెంచి, కేలరీలను త్వరగా ఖర్చు చేయడంలో సహాయపడతాయి. అలాగే శరీరంలో నిల్వ ఉన్న అదనపు నీటిని బయటకు పంపించి ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. చిన్న యాలకుల్లో పెద్ద గుణం ఉంది. ఇవి ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరిచి, రక్తంలో షుగర్ స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.
- డయాబెటిక్ రోగులకు ఇది ఒక సహజమైన ఔషధంగా పనిచేస్తుంది.
ముఖం మీద మచ్చలు, మొటిమలు, డల్ స్కిన్ వంటి చర్మ సమస్యలతో ఇబ్బందిపడేవారికి యాలకులు మేలు చేస్తాయి.
- యాలకుల యాంటీఆక్సిడెంట్, యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తాయి. రక్తప్రసరణ మెరుగుపడటం వల్ల వెంట్రుకలు రాలడం తగ్గి, జుట్టు పెరగడంలో సహాయపడుతుంది.
- యాలకుల సువాసన మనస్సుకు ప్రశాంతతని చేకూరుస్తుంది. ఇది ఒక సహజమైన ఒత్తిడి నివారణి. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- రాత్రి నిద్రలో ఇబ్బంది ఉన్నవారు పాలు లేదా టీలో యాలకుల పొడిని కలిపి తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
వీటిలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు శ్వాసనాళాల వాపును తగ్గించి, శ్వాసకోశాలను ఆరోగ్యకరంగా ఉంచుతాయి.
- నోటి దుర్వాసనను పోగొట్టడంలో యాలకులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి నోటిలోని దుర్గంధం కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేసి, నోటిని స్వచ్ఛంగా ఉంచుతాయి. అందుకే భోజనం తర్వాత యాలకులు నమలడం ప్రాచీనకాలం నుంచీ అలవాటుగా వస్తోంది.
- యాలకులను నేరుగా నమిలి తినవచ్చు, టీ లేదా కాఫీలో వేసుకుని తాగవచ్చు, పాలలో వేసుకుని తాగవచ్చు, వంటలలో సువాసన కోసం వాడవచ్చు. ప్రతిరోజూ మితంగా యాలకులను ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు పొందవచ్చు.
































