TTDకు త్వరలో ఏఐ చాట్‌బాట్‌

భక్తులకు మెరుగైన సేవలు అందించడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) చర్యలు తీసుకుంటోంది. అందులోభాగంగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే కృత్రిమ మేధ (ఏఐ) చాట్‌బాట్‌ సేవలు సైతం ప్రవేశపెట్టేందుకు ఇటీవల తితిదే ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. అందులోభాగంగా అత్యుత్తమ చాట్‌బాట్‌ సేవలు అందించే సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించగా.. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌), గూగుల్‌ క్లౌడ్‌ తదితర సంస్థలు పాల్గొన్నాయి. వీటిలో ఏడబ్ల్యూఎస్‌ సంస్థ ఏడాదికి రూ.50 లక్షలకే సేవలు అందించేందుకు ముందుకు రావడంతో సదరు టెండర్‌ను తితిదే ఆమోదించింది. త్వరలోనే భక్తులకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శనం, సేవలు, వసతిగదులు, విరాళాలు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని భక్తులు క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఫిర్యాదులు, అభిప్రాయాలనూ పంపవచ్చు. దాదాపు 13 భారతీయ భాషల్లో చాట్‌బాట్‌ సిద్ధమవుతోంది. స్పీచ్‌ టు టెక్ట్స్, టెక్ట్స్‌ టు స్పీచ్‌ సదుపాయాన్ని అందిస్తారు. ఈ మేరకు టీసీఎస్‌ సంస్థ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోందని తితిదే డిప్యూటీ ఐటీ జీఎం వెంకటేశ్వరనాయుడు తెలిపారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.