వ్యాపారంలో దూసుకెళ్తున్న సమంత.. మరో కొత్త బిజినెస్‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సినిమాల్లోనే కాకుండా వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటుతున్నారు. అనారోగ్యం కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, మళ్ళీ కెరీర్‌లో దూసుకువెళుతున్నారు. వరుస చిత్రాలకు సంతకాలు చేయడమే కాకుండా నిర్మాతగా కూడా మారారు. తాజాగా సమంత వ్యాపార రంగంలో మరో కొత్త అడుగు వేశారు. ఆమె ట్రూలీ ష్మా (Truly Shma) పేరుతో తన కొత్త క్లోథింగ్ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఒక ప్రమోషనల్ వీడియోను పంచుకుంటూ కొత్త అధ్యాయం మొదలైంది అనే క్యాప్షన్‌ను జోడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, సినీ ప్రముఖులు, అభిమానులు సమంతకు శుభాకాంక్షలు తెలిపారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.