పిల్లల కోసమే ఈ కారు: డ్రైవర్ అవసరం లేదు

పాన్ మొబిలిటీ షో 2025లో టయోటా కంపెనీ.. పిల్లల కోసం ప్రత్యేకించి మోబి బబుల్ కారును ఆవిష్కరించింది. ఇది పూర్తిగా అటానమస్ ఎలక్ట్రిక్ వెహికల్. ఈ లేటెస్ట్ వెహికల్ చూడటానికి చిన్నదిగా ఉన్నప్పటికీ..


పనితీరులో మాత్రం చాలా ఉత్తమమైనదనే చెప్పాలి.

మొబిలిటీ ఫర్ ఆల్.. చొరవలో భాగంగా టయోటా కంపెనీ మోబి బబుల్ కారును తీసుకొచ్చింది. ఏఐతో పనిచేసే ఈ కారు నావిగేషన్ వంటి వాటిని సొంతంగా నిర్వహస్తుంది. అంటే దీనిని నడపడానికి ప్రత్యేకించి డ్రైవర్లు అవసరం లేదు. అంతే కాకుండా.. ఈ కారులో సేఫ్టీ ఫీచర్స్ బోలెడన్ని ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.

తల్లిదండ్రులు వెంట లేకపోయినా.. పిల్లలను ఈ కారు స్కూలుకు, టూషన్లకు తీసుకెళ్తుంది. పిల్లకోసమే దీనిని డిజైన్ చేశారు, కాబట్టి ఇందులో పదేళ్ల కంటే తక్కువ వయసున్న ఎవరైనా ప్రయాణించవచ్చు. చుట్టూ ఉన్న పరిసరాలను స్పష్టంగా చూడటానికి ఇందులో అన్ని దిశల్లో కెమెరాలు, సెన్సర్లు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా కారు లోపల కూర్చున్న పిల్లలతో మాట్లాడుతూ.. వారి సందేహాలను తీర్చడానికి ఏఐ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది.

టయోటా కంపెనీ ఆవిష్కరించిన మోబి బబుల్ కారు టెస్టింగ్ దశలోనే ఉంది. దీనిని మరిన్ని విధాలుగా చెక్ చేసిన తరువాత మార్కెట్లో లాంచ్ చేయనున్నారు. అయితే సంస్థ ఈ కారును ఎప్పుడు లాంచ్ చేస్తుంది, దీని ధర ఎంత ఉండొచ్చు అనే వివరాలను వెల్లడించాల్సి ఉంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.