కళకళలాడుతున్న శివ థియేటర్లు

న్నో ఏళ్లుగా అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న శివ రీ రిలీజైంది. సినిమా రీ రిలీజ్ వెర్షన్ కోసం ఆర్జీవి స్పెషల్ గా మరో 8 నెలలు కష్టపడ్డారు.


36 ఏళ్ల క్రితం తెలుగు సినిమానే కాదు ఇండియన్ సినిమా రూపురేఖలని మార్చిన సినిమా శివ. ఆ సినిమాతో రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ పరిచయం అయ్యాడు. నాగార్జునకు శివ సినిమాతో మాస్ హిట్ అందుకున్నారు. ఐతే శివ సినిమా రీ రిలీజ్ ప్రమోషన్స్ కూడా భారీగా చేశారు నాగార్జున అండ్ టీం. అన్నపూర్ణ స్టూడియోస్ 50వ సంవత్సరంలో శివ రీ రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో శివ 4కె ప్రింట్ ని ఎంతో ఇష్టంతో ఈ సినిమా రెడీ చేశారు.

ఆఫ్టర్ 36 ఇయర్స్ వెండితెర మీద శివ :

ఐతే శివ సినిమా గురించి అప్పటి యూత్ ఆడియన్స్ అంటే ఇప్పుడు దాదాపు 50, 60 ప్లస్ అయ్యి ఉంటారు. కానీ అప్పటి నుంచి ఆ సినిమా గురించి గొప్పగా చెబుతుంటే నేటి యూత్ ఆడియన్స్ ఆ సినిమా వెండితెర మీద ఒకసారి చూసి ఆస్వాధించాలని ఫిక్స్ అయ్యారు. అందుకే శివ రీ రిలీజ్ కు మంచి బజ్ ఏర్పడింది. తెలుగు రెండు రాష్ట్రాల్లో శివ నేడు రీ రిలీజైంది. హైదరాబాద్ లో చాలా చోట్ల శివ సినిమాకు సూపర్ రెస్పాన్స్ అదిరిపోయే బుకింగ్స్ జరుగుతున్నాయి.

ఆర్జీవి తో పాటు కొంతమంది సినీ ప్రముఖులు దేవి థియేటర్లో శివ సినిమా చూశారు. 36 ఏళ్ల క్రితం అదే థియేటర్ లో శివ రిలీజ్ అవ్వగా ఇప్పుడు అదే థియేటర్ లో ఆఫ్టర్ 36 ఇయర్స్ సినిమా చూశారు ఆర్జీవి. శివ రీ రిలీజ్ కు అంచనాలకు తగినట్టుగానే సూపర్ రెస్పాన్స్ వస్తుంది. తెలుగు సినిమా బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అని ఎందుకు అంటారు అన్నది ఎక్స్ పీరియన్స్ చేసేలా తెలుగు ఆడియన్స్ వయసుతో తేడా లేకుండా శివని వెండితెర మీద చూసేందుకు ప్రయత్నిస్తున్నారు.

శివ రీ రిలీజ్ కోసం అక్కినేని ఫ్యాన్స్..

మరి నాగార్జున స్పెషల్ ఇంట్రెస్ట్ తో రీ రిలీజ్ చేసిన ఈ శివ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది అన్నది చూడాలి. ఈమధ్య కాలంలో స్టార్ సినిమాల రీ రిలీజ్ ల హడావిడి కాస్త తగ్గింది. ప్రతి సినిమా రీ రిలీజ్ చేస్తున్నారని ఫ్యాన్స్ కూడా పట్టించుకోవడం మానేశారు. కానీ శివ రీ రిలీజ్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. తప్పకుండా ఈ సినిమా అక్కినేని ఫ్యాన్స్ కి నూతన ఉత్సాహం అందిస్తుందని చెప్పొచ్చు. అంతేకాదు శివ రీ రిలీజ్ కు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ తో నాగార్జున కూడా తన 100వ సినిమాపై ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.