సెకండ్ ఇన్నింగ్స్ అనే పదం నా డిక్షనరీలోనే లేదు: బాలకృష్ణ

బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 (Akhanda 2)త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే . ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.


తాజాగా ముంబైలో ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అఖండ తాండవం అంటూ సాగిపోయే ఈ పాట ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ ఫస్ట్ సింగిల్ లాంచ్ కార్యక్రమాన్ని ముంబైలో ఏర్పాటు చేయడంతో చిత్ర బృందం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో బాలకృష్ణ (Balakrishna)చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నిజాలు మాట్లాడుతూ, ధర్మంగా బ్రతకడం..

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… అఖండ 2 సినిమాలో హిందూ సనాతన ధర్మం హిందూ ధర్మ పరిరక్షణ గురించి తెలియజేశారని తెలిపారు. అఖండ తాండవం అంటే ప్రతి ఒక్కరు కూడా నిజాలు మాట్లాడుతూ.. అన్యాయానికి తలవంచకుండా, ధర్మంగా బ్రతికేదేనని తెలిపారు. అఖండ తాండవం పాట చాలా అద్భుతంగా వచ్చిందని తెలిపారు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలను తీసుకెళ్లి ఈ సినిమా చూపించాలని ఈ సినిమా ద్వారా హిందూ ధర్మం గురించి పిల్లలు కూడా తెలుసుకుంటారని బాలకృష్ణ తెలిపారు.

సెకండ్ ఇన్నింగ్స్ కు చోటు లేదు…

అనంతరం ఆ బోయపాటితో తనకున్నటువంటి బాండింగ్ గురించి కూడా మాట్లాడారు. ఇప్పటివరకు తామిద్దరం కలిసి నాలుగు సినిమాలు చేశామని మా ఇద్దరిదీ ఒకటే వేవ్ లెంత్ అంటూ బాలయ్య మాట్లాడారు . అలాగే సినిమా ఇండస్ట్రీలోకి బాలకృష్ణ అడుగుపెట్టి 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు ఇలా తన సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ.. 50 సంవత్సరాల నా సినీ జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ (Second Innings)అనే పదం నా డిక్షనరీలోనే లేదు అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

ద్విపాత్రాభినయంలో బాలకృష్ణ..

ఇక అఖండ తాండవం సినిమా డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి కార్యక్రమాన్ని ముంబైలో ప్రారంభించాము ఇప్పటినుంచి వరుసగా ప్రమోషన్లు జరుగుతాయి అంటూ బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి. ఇక అఖండ తాండవం పాట కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బాలయ్య సినీ కెరీర్ లోనే మొదటిసారి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిందీలో కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరగడంతో అక్కడ కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించారు. ఇక హీరోయిన్గా సంయుక్త మీనన్(Samyuktha Menon) నటించగా ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.