ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ.. ఒక కప్పు 80 వేలు మాత్రమే, ఫుల్ డిటైల్స్ ఇవే

దుబాయ్లోని ఒక కేఫ్ ప్రపంచవ్యాప్తంగా హెడ్లైన్స్లో నిలిచింది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీని అందిస్తోంది.


ఒక కప్పు ధర 3,600 దిర్హమ్స్ (సుమారు $980). మరి దీని ధర ఎందుకు అంత ఎక్కువగా ఉందో? కాఫీ లవర్స్​కి వీరు అందించే ప్రత్యేక రుచి ఏంటో వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చూసేద్దాం.

అరుదైన కాఫీ

ఈ విలాసవంతమైన కాఫీ బీన్స్​ని పశ్చిమ పనామాలోని మౌంట్ బారు అగ్నిపర్వత వాలులలో పండించే అరుదైన, ఎలైట్ జాతిగా చెప్తారు. ఇది నీడో 7 రకమైన గీషా బీన్స్ నుంచి వస్తుందట. ఈ బీన్స్ చిన్న మైక్రో-లాట్లలో పెరుగుతాయి. ప్రతి పంట కేవలం కొన్ని కిలోలు మాత్రమే ఇస్తుంది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన కాఫీ బీన్స్లో ఒకటిగా నిలిచింది. అందుకే దీనిని దుబాయ్లోని జూలిత్ కెఫే ప్రీమియంగా సుమారు 400 కప్పులను మాత్రమే అందించాలని యోచిస్తోంది. కాఫీ ప్రియులలో కొందరు మాత్రమే దీనిని రుచి చూడగలుగుతారు.

రికార్డు సృష్టించిన వేలం

ఈ సంవత్సరం ప్రారంభంలో నీడో 7 గీషా బీన్స్ పనామాలో జరిగిన వేలంలో రికార్డు ధరను సాధించింది. ఇక్కడ 20 కిలోల గీషా బీన్స్​ సుమారు 2.2 మిలియన్ దిర్హమ్స్ ($600,000)లకు అమ్ముడయ్యాయి. అంతర్జాతీయ కొనుగోలుదారులలో చాలా బిడ్డింగ్ జరిగి ప్రపంచ రికార్డును సృష్టించింది.

రిజర్వ్ చేసి మరి ఇస్తారట

జూలిత్లో హెడ్ కాఫీ రోస్టర్ సెర్కాన్ సాగ్సోజ్ ది నేషనల్తో మాట్లాడుతూ.. దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కోసం ఒక కప్పు రిజర్వ్ చేశామని వెల్లడించారు. కొద్దిమంది మాత్రమే దీనిని తాగగలరని తెలిపాడు. ఇది ఒక గిమ్మిక్ లేదా మార్కెటింగ్ స్టంట్ కాదని తెలిపాడు. “నీడో 7 గీషా అనేది అసాధారణమైన కాఫీ. దీనిని భూమిపై కొద్దిమంది మాత్రమే రుచి చూస్తారు. ఇప్పుడు.. ఇది.. దుబాయ్లో అందుబాటులో ఉంది. ఇది లిమిటెడ్ కావడంతో ప్రతి కప్పు చరిత్రలో ఒక భాగంగా అనిపిస్తుందని తెలిపారు.

కాఫీ టేస్ట్ ఎలా ఉంటుందంటే..

కాఫీ ప్రొఫైల్ చాలా మైల్డ్, లేయర్స్​గా వర్ణించారు సాగ్సోజ్. జాస్మిన్ వంటి తెలుపు ఫ్లవర్ నోట్స్, నారింజ, బెర్గామోట్ వంటి సిట్రస్ ఫ్లేవర్.. నేరేడు, పీచ్ వంటి మైనర్ అండర్టోన్లు ఉంటాయి. “ఇది తేనెలా ఉంటుంది. మృదువైనది, సువాసనగలది, తీపిగా ఉంటుంది” అని చెప్పారు.

క్రౌన్ జ్యువెల్!?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ప్రియులు నీడో 7 గీషాను గీషా కుటుంబానికి చెందిన “క్రౌన్ జ్యువెల్”గా భావిస్తారు. ఈ రకం బెస్ట్ ఆఫ్ పనామా పోటీలో 98 స్కోరును సాధించింది. ఇది కాఫీ ప్రపంచంలో అత్యధికంగా నమోదు చేసిన వాటిలో ఒకటిగా నిలిచింది. వాస్తవానికి.. ఆరుగురు అంతర్జాతీయ న్యాయమూర్తులు కూడా దీనికి 100 మార్కులు ఇచ్చారు.

గ్లోబల్ బెంచ్మార్క్

దుబాయ్ ఇప్పటికే అత్యంత ఖరీదైన కాఫీకి గిన్నిస్ వరల్డ్ రికార్డును కలిగి ఉంది. గతంలో ఒక కప్పు కాఫీ 2,500 దిర్హమ్స్ ($680)లకు అమ్ముడైంది. కానీ జూలిత్ కాఫీ ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఇది లగ్జరీ బ్రూస్కు కొత్త గ్లోబల్ బెంచ్మార్క్ను సెట్ చేసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.