రూ.1201 కోట్ల పెట్టుబడులు.. రేమాండ్‌ ప్రాజెక్టుకు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన

విశాఖపట్నం వేదికగా జరుగుతోన్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండో రోజు రేమాండ్ గ్రూప్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..


అనంతపురం జిల్లాలో రూ.1201 కోట్ల పెట్టుబడులతో మూడు వేర్వేరు పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని, ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రేమాండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మైనీ, ఆ సంస్థ కార్పోరేట్ డెవలప్మెంట్ హెడ్ జతిన్ ఖన్నా, మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు..

రూ.1201 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది రేమాండ్ గ్రూప్ .. సిల్వర్ స్పార్క్ అప్పారెల్, జేకే మైనీ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్, జేకే మైనీ గ్లోబల్ ప్రెసిషన్ లిమిటెడ్ యూనిట్లకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ రోజు శంకుస్థాపన చేశారు.. అనంతపురం జిల్లాలోని రాప్తాడులో రూ.497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అప్పారెల్ మాన్యుఫాక్చరింగ్ పార్క్ ను ఏర్పాటు చేయనుంది రేమాండ్ గ్రూప్ .. ఇక, అనంతపురం జిల్లా గుడిపల్లిలో రూ.441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌ను రేమాండ్ గ్రూప్ ఏర్పాటు చేస్తుంది.. మరోవైపు, అనంతపురం జిల్లా టెకులోదు వద్ద రూ.262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు.. మొత్తంగా రూ.1201 కోట్ల పెట్టుబడులతో మూడు వేర్వేరు పరిశ్రమల ఏర్పాటు ద్వారా 6,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది రేమాండ్ సంస్థ..

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.