హైదరాబాద్ ఖైరతాబాద్ ఆర్టీవో పరిధిలో ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల ఆన్‌లైన్ వేలం మరోసారి భారీ ఆదరణను సంతరించుకుంది. పలువురు సంస్థలు, వ్యాపారవేత్తలు, వ్యక్తులు తమకు నచ్చిన ప్రత్యేక వాహన నంబర్ల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశారు.
తాజాగా జరిగిన వేలంలో పలువురు బిడ్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఒక్క రోజులోనే ఆర్టీఏ నిర్వహించిన వేలంపాటలో 65 లక్షల 38 వేల 898 రూపాయలు ఆదాయం వచ్చింది. వీటిలో అత్యధికంగా TG09H9999 నెంబర్ కు 22,72,222 పలికింది. మరోవైపు అత్యంత తక్కువకి TG 09J0003 నంబర్‌ను 1,15,121 ధరకు దక్కించుకున్నారు.
TG09J 0009 నంబర్ కోసం జరిగిన పోటీలో M/s డండు ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.6,80,000 చెల్లించి నెంబర్‌ను దక్కించుకుంది. TG09J 0006 కు సాయి సిల్క్స్ కలమందిర్ లిమిటెడ్ రూ.5,70,666 చెల్లించింది. TG09J 0099 నెంబర్‌ను గోదావరి ఫార్చ్యూన్ సంస్థ రూ.3,40,000కు సొంతం చేసుకుంది. TG09J 0001 నంబర్‌ను శ్రీనిధి ఐటీ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,60,000 చెల్లించి పొందింది.
TG09J 0005 నంబర్‌ను నిహారిక ఎంటర్టైన్‌మెంట్ రూ.2,40,100 చెల్లించి పొందగా, TG09J 0018 నంబర్‌ను రోహిత్ రెడ్డి ముత్తు రూ.1,71,189కు కొనుగోలు చేశారు. TG09J 0007 నంబర్‌ను కొండవరపు శ్రీనివాస్ నాయుడు రూ.1,69,002 చెల్లించి పొందారు. TG09J 0077 నంబర్‌ను మీనాక్షి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,41,789 చెల్లించి విజయవంతంగా బిడ్ గెలుచుకుంది. ఇక TG09J 0123 నెంబర్‌ను అకుల మాధురి రూ.1,19,999 చెల్లించి తీసుకున్నారు.
ఫ్యాన్సీ వాహన నంబర్ల కోసం నిర్వహించే ఈ-వేలం ప్రతిసారి భారీ పోటీ, ఆకర్షణీయ బిడ్లతో కొనసాగుతూనే ఉందని ఖైరతాబాద్ ఆర్టీవో అధికారులు తెలిపారు. ఏడాది అక్షరాల 65.38 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేష్ తెలిపారు.




































