తరచూ నోటి పూతలతో బాధపడుతున్నారా?..

మారుతున్న లైఫ్‌స్లైట్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందికి తరచుగా నోటి పూతల సమస్య భారీన పడుతున్నారు. ఈ సమస్యతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


జీర్ణక్రియ సరిగా లేకపోవడం, విటమిన్ బి12, ఐరన్ లేదా ఫోలిక్ యాసిడ్ లోపాలు, శరీర వేడి పెరగడం, ఒత్తిడి, కారంగా లేదా పుల్లగా ఉండే ఆహారాలు తినడం, ధూమపానం, నిద్ర లేకపోవడం కారణంగా ఈ సమస్య వస్తుంది. కొన్నిసార్లు, సరిగ్గా బ్రెస్ చేయకపోవడం కూడా నోటి పూతలకు కారణం కావచ్చు. వాతావరణ మార్పులు, హార్మోన్ల అసమతుల్యత కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి సందర్భాలలో, బాబా రాందేవ్ సూచించిన ఆయుర్వేద పద్ధతులు నోటి పూతల నుండి ఉపశమనం పొందడంలో మీకూ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.

మీకూ తరచూ నోటిపూతలు వస్తున్నా.. మీరు సరైన చికిత్స తీసుకోకపోతే.. దీర్ఘకాలంలో మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇది ఎక్కువైతే భవిష్యత్తులో తినడం, మాట్లాడటం, పళ్ళు తోముకోవడం కూడా కష్టం అవుతుంది. దానితో పాటు నోటి నుంచి దుర్వాసన, రుచి లోపం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే, ఈ పరిస్థితి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అలాగే శరీరంలో మంటను పెంచుతుంది. నొప్పి, చికాకు కారణంగా మీరు తినడం తగ్గిస్తారు.దీని వల్ల మీరు బలహీనంగా మారుతారు.

ఈ సమస్యకు చెక్‌పెట్టేందుకు ఈ ఆయుర్వేద పద్ధతులను పాటించండి

నోటి పూతల నుండి ఉపశమనం పొందడానికి కలబంద అత్యంత ప్రభావవంతమైన నివారణ అని స్వామి రామ్‌దేవ్ చెబుతున్నారు. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కలబంద రసాన్ని తాగితే.. మీ శరీరంలోపి వేడి తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కలబంద జెల్‌ను నేరుగా పుండుకు పూయడం వల్ల మంట, నొప్పి, వాపు నుండి కూడా తక్షణ ఉపశమనం లభిస్తుంది. అదనంగా, శరీరాన్ని చల్లగా ఉంచడానికి పుచ్చకాయ, దోసకాయ, కొబ్బరి నీరు, మజ్జిగ వంటి చల్లని ఆహారాలు తీసుకోవాలి. కారంగా, వేయించిన, అధికంగా పుల్లగా ఉండే ఆహారాల జోలికి అస్సలు వెళ్లవద్దు.

దీనితో పాటు మీరు రోజూ మీ శరీరానికి అవసరమైనంత నీరు త్రాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయడం వల్ల కూడా నోటి పూతల సమస్యను తగ్గించుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించడం, సరిగ్గా నిద్రపోవడం కూడా చాలా అవసరం, ఎందుకంటే ఒత్తిడి, నిద్ర లేకపోవడం కారణంగా ఈ సమస్య మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల, ఆయుర్వేద నివారణలు, జీవనశైలి మార్పులతో కలిపి, నోటి పూతలను త్వరగా నయం చేయవచ్చని ఆయన చెబుతున్నారు.

నోటి పూతను తగ్గించేందుకు ఇలా చేయండి

  • నోటి పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోండి, రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి.
  • పుల్లని పండ్లు, వేడి ఆహారాన్ని తినడం మానుకోండి.
  • జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.
  • ధూమపానం, మద్యం, పొగాకుకు పూర్తిగా దూరంగా ఉండండి.
  • బొబ్బలు ఎక్కువ కాలం కొనసాగితే, వైద్యుడిని సంప్రదించండి.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.