I Bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కూకట్‌పల్లి రెయిన్‌బో విస్టా అపార్ట్‌మెంట్‌లో రవిని అరెస్టు చేసిన పోలీసులు..
రవి ఉంటున్న అపార్ట్మెంట్‌లో కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో ఉన్న 3 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. ఇప్పటికే ఐ బొమ్మ, బప్పమ్ వెబ్‌సైట్లు బ్లాక్ చేయించారు. 1X Bet బెట్టింగ్ లింకులను ట్రేస్ చేయగా ఐ బొమ్మ లింక్ దొరికినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకు సవాలు విసిరిన అనంతరం తనను ఎవ్వరు పట్టుకోగలరని ధీమాతో ఇమ్మడి రవి ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఇమ్మడి రవి నెదర్లాండ్స్ నుంచి కూకట్ పల్లికి రావడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. నిన్న మెజిస్ట్రేట్ ముందు రవిని హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే పోలీసులు 7 రోజుల కస్టడీకి కోరుతున్నారు
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసుల విచారణతో ఇమ్మడి రవి ఆటకట్టయింది. ఐ-బొమ్మ వెబ్‌సైట్‌లో రెగ్యులర్‌గా 1Xబెట్ లాంటి యాప్స్ ప్రకటనలు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐ-బొమ్మలో నెలనెలా 35-40 లక్షల మంది లు చూస్తున్నారు. ప్రేక్షకుల్ని బెట్టింగ్ ఊబిలోకి దించేందుకే.. ఐ-బొమ్మ రవితో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల డీల్స్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌తో రవి కోట్లకు కోట్లు సంపాదించాడు. యాప్స్ నిర్వాహకులు-రవి మధ్య భారీ లావాదేవీలు గుర్తించారు. డబ్బు ఇంకా ఎక్కడెక్కడ దాచాడనే దానిపైనా పోలీసుల ఫోకస్ చేస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి.. కరేబియన్ దీవుల వరకు..
పైరసీ కింగ్ పిన్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇమ్మడి రవి.. ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చదివాడు. నెదర్ల్యాండ్స్, కరేబియన్ దీవులకు వెళ్లే ముందు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీని ఏర్పాటుచేశాడు.. ER infotech అనే సాఫ్ట్‌వేర్ కంపెనీకి CEO గా ఉన్నాడు. నెదర్లాండ్స్ నుంచి Cloud fare, OTT సర్వర్లను హ్యాక్ చేసి పైరసీలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. పైరసీ చేసిన లను ఐ బొమ్మ, బప్పం, ఐ విన్, బప్పం టీవీలలో ఇమ్మడి రవి ఉంచుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఐ బొమ్మలో లను చూసే వారిని బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

































