17 ఏళ్లకే మిస్ ఇండియా.. కట్ చేస్తే.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్.. 62 ఏళ్ల వయసులో తగ్గని డిమాండ్..

సినీరంగంలో నటిగా అవకాశాలు అందుకోవడం అంటే చాలా కష్టమైన పని. కానీ కొందరి జీవితాల్లో మాత్రం ఆఫర్లతోపాటు వచ్చిన స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవడం కూడా సవాలుతో కూడుకున్న పని.


మొదటి తోనే సెన్సేషన్‌గా మారిన హీరోయిన్స్ ఉన్నారు. కానీ తర్వాత వైఫల్యాల కారణంగా ప్రేక్షకుల దృష్టి నుండి కనుమరుగయ్యారు. అయితే 1983లో ఒక ఫ్లాప్ తో తెరంగేట్రం చేసిన ఈ అమ్మాయి.. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినీరంగానికి దూరమయ్యింది. ఆమె పేరు మీనాక్షి శేషాద్రి. మొదటి ఫ్లాప్ అయింది, కానీ ఆమె రెండవ “హీరో” ఆమెను రాత్రికి రాత్రే స్టార్‌గా మార్చింది.

మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తర్వాత, మీనాక్షి శేషాద్రి 1983లో “పెయింటర్ బాబు”తో అరంగేట్రం చేసింది, కానీ ఆ చిత్రం ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత హీరో తో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. 1993లో విడుదలైన “దామిని” ఆమెను స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది. మీనాక్షి శేషాద్రి అసలు పేరు శశికళ శేషాద్రి, ఆమె నవంబర్ 16, 1963న బీహార్ (ఇప్పుడు జార్ఖండ్)లోని సింద్రీలో జన్మించారు. చిన్నప్పటి నుంచే శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. భరతనాట్యం, కూచిపూడి, కథక్ , ఒడిస్సీ నృత్యాలు నేర్చుకుంది. 1981లో మిస్ ఇండియా టైటిల్ గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
మెగాస్టార్ చిరంజీవి జోడిగా ఆపద్భాంధవుడు చిత్రంలో నటించింది. ఈ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ తర్వాత తెలుగులో మరో మవీ చేయలేదు. కెరీర్ లో స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని లకు దూరమయ్యింది. ప్రస్తుతం మీనాక్షి USAలోని టెక్సాస్‌లో నివసిస్తుంది. అలాగే చార్మ్స్ డ్యాన్స్ అకాడమీ అనే తన సొంత డ్యాన్స్ అకాడమీని నిర్వహిస్తోంది. స్టార్ నుండి కోచ్‌గా, మీనాక్షి విదేశాలలో భారతీయ సంస్కృతిని ప్రచారం చేస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.