ఏ క్రీడలోనైనా భారతదేశం vs పాకిస్థాన్ మ్యాచ్‌లు ఎల్లప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటాయి. క్రికెట్లో ఇరు దేశాల మధ్య మాచ్ హీట్‌ను జనరేట్ చేస్తుంది.
ఈ మ్యాచ్ ఏదో ఒక సమయంలో వివాదాలకు కారణమవుతుంది. రెండు ఆసియా దేశాల మధ్య చాలా కాలంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పహల్గాం దాడి తరువాత భారత్ vs పాక్ మ్యాచ్‌లు తీవ్రం రూపాన్ని దాల్చాయి. ఇరు దేశాల మధ్య మ్యాచ్‌లలో అనేక వివాదాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా భారత్, పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్స్ మైదానంలో గొడవకు దిగిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇద్దరు ప్లేయర్స్ గల్లాలు పట్టుకుని మరీ కొట్టుకుంటున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది.
తాజాగా షార్జాలో జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా భారత్, పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్ళు మైదానంలో గొడవ పడుతున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుంది. ఈ ప్లేయర్స్ జెర్సీలు సైతం ధరించారు. తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు వీడియో వైరల్ అవుతోంది. గొడవకు దిగిన ఇద్దరినీ విడిపించడానికి రెండు టీంల ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను ‘vijayma70555375’ అనే యూజర్‌నేమ్‌తో ఎక్స్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. నిజంగానే మైదానంలో ఆటగాళ్లు గొడవ పడ్డారా? అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..
అయితే.. ఇరు దేశాల మధ్య ఆటగాళ్లు మైదానంలో గొడవ పడుతున్నట్లు చూపించే వీడియో నకిలీది. ఈ వీడియోకు వాస్తవికతతో సంబంధం లేదు. AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉపయోగించి దీన్ని రూపొందించారు. వైరల్ వీడియోలో చూసినట్లుగా, మైదానంలో ఎలాంటి గొడవ జరగలేదు. గొడవ పడుతున్న ఆటగాళ్ళు నిజమైన మనుషులు కాదు. AI- సృష్టించిన పాత్రలు కాదు. వీడియోలోని 0:07 సెకన్లు వద్ద ఈ వీడియోను చూస్తే నకిలీదని క్లియర్‌గా అర్థమవుతుంది.






























