నవంబర్ 18 వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఇవే… అంతర్జాతీయ మార్కెట్లో పడిపోతున్న పసిడి ధర

బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు స్వల్పంగా పెరిగినట్లు గమనించవచ్చు. నవంబర్ 18 వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,26,530 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,950 పలికింది. ఒక కేజీ వెండి ధర రూ. 1,58,330 పలికింది. పసిడి ధరలు నిజానికి ఆల్ టైం రికార్డ్ స్థాయితో పోల్చి చూస్తే ప్రస్తుతం దాదాపు 8 వేల రూపాయల తక్కువగా ట్రేడ్ అవుతున్నట్టు గమనించవచ్చు. నిజానికి అంతర్జాతీయ మార్కెట్లలో గమనించినట్లయితే అమెరికాలో గడచిన రెండు రోజుల్లో ఒక ఔన్స్ బంగారం ధర 4200 డాలర్ల నుంచి 4000 డాలర్లకు పడిపోయింది. అంటే దాదాపు 200 డాలర్లు పడిపోయింది. దీన్ని భారతీయ కరెన్సీలో చూస్తే దాదాపు 16000 రూపాయలు తగ్గిందని చెప్పవచ్చు. బంగారం ధర తగ్గడానికి ప్రధానంగా డాలర్ విలువ పెరగడమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర దేశీయ మార్కెట్లో ఇంకా స్థిరంగా ట్రేడ్ అవుతోంది. కానీ అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం తగ్గడం గమనించవచ్చు. దీని ప్రభావం దేశీయ మార్కెట్ల పై కూడా పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే బంగారం ధరలు కొత్త సంవత్సరంలో జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం డిసెంబర్ నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచే అవకాశం ఉందని పెద్ద ఎత్తున అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధికారులు కూడా సూచనలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ ఫెడరల్ రిజర్వ్ కనుక వడ్డీరేట్లు స్థిరంగా ఉంచినట్లయితే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
దీనికి ప్రధాన కారణం వడ్డీరేట్లు ఒకవేళ స్థిరంగా ఉంచినట్లయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ జారీ చేసే ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ అదే జరిగినట్లయితే, ఇన్వెస్టర్లు స్థిరంగా రాబడి అందించే ట్రెజరీ బాండ్ల లోనే పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారని, సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు వెండి ధర విషయానికి వచ్చినట్లయితే వెండి ధరలు మాత్రం పెరగడం చూడవచ్చు. మార్కెట్లో వెండి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుందని నిపుణులు పేర్కొంటున్నారు.

 


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.