దేశంలోనే మొట్టమొదటి స్కీమ్.. నెలకు రూ.250 ఉంటే చాలు.. నవంబర్ 28 వరకే ఛాన్స్

దేశంలోనే తొలిసారి మూమెంటమ్ ఆధారిత స్మాల్ క్యాప్ ఫండ్‌ లాంచ్ చేసింది ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ సామ్కో మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ బలమైన వృద్ధిని కనబరిచే వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ నవంబర్ 28వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో నెలవారీ కనీస పెట్టుబడి రూ.250గా ఉంది. మరి ఈ కొత్త తరహా స్కీమ్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈక్విటీ ఇన్వెస్టర్లకు అలర్ట్. మ్యూచువల్ ఫండ్స్‌లో మరో కొత్త తరహా స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. భారత్‌లోని తొలి మూమెంటమ్ బేస్డ్ స్మాల్ క్యాప్ ఫండ్‌‌ను ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ సామ్కో ఏఎంసీ లాంచ్ చేసింది ( SAMCO Mutual Fund ). బలమైన ఆదాయాలు, రాబడులను ప్రదర్శించే అభివృద్ధి చెందుతున్న వ్యాపారాలను గుర్తించి వాటిలో పెట్టుబడి పెట్టేలా ఈ కొత్త తరహా పథకాన్ని లాంచ్ చేసినట్లు ఏఎంసీ తెలిపింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 14,2025 రోజునే ప్రారంభమైంది.నవంబర్ 28వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.


సామ్కో స్మాల్ క్యాప్ ఫండ్ ( SAMCO Small Cap Fund ) అనేది ఒక ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్. ఈ ఫండ్ ప్రధానంగా స్మాల్ క్యాప్ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 251 నుంచి 750 వరకు ర్యాక్ అయి ఉన్న కంపెనీలను ఎంచుకుంటుంది. భారత్‌లో విస్తరిస్తున్న మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకుని మంచి లాభాలను అందుకునే స్టాక్స్ ఎంచుకుని వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫండ్ సామ్కో ప్రొప్రైటరీ కేర్ (C.A.R.E) మూమెంటమ్ స్ట్రాటజీతో వస్తోంది. (CARE- క్రాస్ సెక్షనల్, అబ్సోల్యూట్, రెవెన్యూ, ఎర్నింగ్స్ మూమెంటమ్) ప్రకారం పని చేయనుంది. స్థిరమైన దీర్ఘకాలిక లాభాలను అందించడం లక్ష్యంగా అధిక ధర, వ్యాపార వృద్ధిని ప్రదర్శించే కంపెనీలను గుర్తించేందుకు ఈ మోడల్ పరిమాణాత్మక, ప్రాథమిక అంశాలను మిళితం చేస్తుందని కంపెనీ తెలిపింది.

నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 టీఈఆర్ లాంచ్ అయినప్పటి నుంచి వార్షిక రాబడి 16.05 శాతంగా ఉంది. అలాగే మూమెంటమ్ ఆధారిత ఇండెక్స్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 మూమెంటమ్ క్వాలిటీ 100 టీఆర్ఐ అనేది 22.03 శాతం మేర సీఏజీఆర్ కలిగి ఉంది. అంటే మూమెంటమ్ వ్యూహాలు ఏ విధంగా మంచి లాభాలు అందిస్తాయో ఈ గణాంకాలే చెబుతున్నాయని ఏఎంసీ పేర్కొంది. ఈ కొత్త స్కీమ్ బెంచ్ మార్క్‌గా నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్ ఉంటుంది. ఉమేశ్ కుమార్ మెహతా ఈ ఫండును నిర్వహిస్తారని కంపెనీ వెల్లడించింది.

సబ్‌స్క్రిప్షన్ సమయంలో కనీస అప్లికేషన్ రూ.5000గా నిర్ణయించారు. ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. కనీస అదనపు అప్లికేషన్ అమౌంట్ రూ.500గా ఉంటుంది. నెల నెలా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ( SIP) ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనీస పెట్టుబడి రూ.250గా ఉంటుంది. ఇందులో ఎంట్రీ లోడ్ ఉండదు. అయితే యూనిట్లు కేటాయింటిన 30 రోజుల్లోనే రిడీమ్ చేసుకుంటే 1 శాతం మేర ఎగ్జిట్ లోడ్ పడుతుంది. 30 రోజుల తర్వాత డబ్బులు వెనక్కి తీసుకుంటే ఎలాంటి ఎగ్జిట్ లోడ్ ఉండదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.