శీతాకాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. శీతాకాలంలో సాధ్యమైనంతవరకు ఆరోగ్యకరమైన ఆహారం తినడం బెటర్. ఇది ఆరోగ్య సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ కాలంలో జీడిపప్పు, బాదం పప్పు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటాయి.
జీడిపప్పు, బాదం పప్పులతో పాటు పిస్తాపప్పులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చాలా మంది పిస్తాపప్పులు తినేందుకు పెద్దగా ఇష్టపడరు. పిస్తాపప్పులు తినడం వల్ల బరువు పెరుగుతుందని అనుకుంటారు. అందుకే పిస్తా తినేందుకు జంకుతారు.
పిస్తాపప్పులు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే వాటిని ఎక్కువగా తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా పిస్తాపప్పులు తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయట.
ప్రతిరోజు ఉదయం పూట ఐదు నుంచి ఏడు వరకు పిస్తాపప్పులు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఏడు కంటే ఎక్కువ పిస్తాపప్పులు తింటే మాత్రం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
ఒక రోజులో ఏడు పిస్తాపప్పుల కంటే ఎక్కువ తింటే ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుంది. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నవారు పిస్తాపప్పులు తినడం మానుకోవాలి. పిస్తాపప్పులు నోటి రుచిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఉదయం పూట పిస్తాపప్పులు తినడం మంచిది. మధ్యాహ్నం లేదా రాత్రి తినడం కంటే ఉదయం తినడం వల్ల ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.
































