సెల్ ఫోన్ లో ఇలా చేస్తున్నారా? 50 లక్షల జరిమానా, మూడేళ్ళ జైలు!

మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. సెల్ఫోన్లకు సంబంధించి ఎలాంటి తప్పులు చేయకూడదు? ఏది నాన్ బెయిలబుల్ నేరం కిందికి వస్తుంది అనే అంశాలపైన టెలికం విభాగం తాజాగా స్పష్టమైన ప్రకటన చేసింది.


సెల్ ఫోన్లకు సంబంధించిన 15 అంకెల ఐఎంఈఐ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ నెంబర్ ను మారిస్తే అది నాన్ బెయిలబుల్ నేరమని టెలికాం విభాగం పేర్కొంది.

మొబైల్ ఫోన్ విషయంలో ఇదే కీలకం

ఐఎంఈఐ నెంబర్ అంటే ఫోన్ కు ఆధార్ కార్డు వంటిది. మొబైల్ ఫోన్ పోతే ట్రేస్ చేయడానికి, దానిని బ్లాక్ చేయడానికి, దీనిని ఉపయోగిస్తారు. సర్వీస్ సెంటర్లో ఫోన్ ను చెక్ చేయడానికి, వారంటీ వాలిడేషన్ చేయడానికి కూడా ఐఎంఈఐ ఉపయోగపడుతుంది. ఐఎంఈఐ నెంబర్లతో ఫోన్ ఒరిజినల్ దా, కాదా అన్నది కూడా తెలుసుకోవచ్చు.

ఇది ప్రతి ఫోన్ కు కంపెనీ ఒక యూనిక్ ఐడి

సాధారణంగా ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే, లేదా దొంగిలించబడితే ఆ ఫోన్ ను పోలీసులు ఐఎంఈఐ నంబర్ ద్వారానే ఐడెంటిఫై చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఆ మొబైల్ ని తయారు చేసిన కంపెనీ ఫోన్ కి ఇచ్చే యునిక్ ఐడి. ప్రతి ఫోన్ కు కంపెనీ ఒక యూనిక్ ఐడి ని ఇస్తుంది.

వారికి టెలికాం శాఖ హెచ్చరిక

ఆ మోడల్ లో కోట్ల సంఖ్యలో ఫోన్లు ఉన్నప్పటికీ ఐఎమ్ఈఐ నెంబర్ మాత్రం ఒక్కొక్క ఫోన్ కు ఒక్కోటి ఉంటుంది. డ్యూయల్ సిమ్ ఫోన్లు అయితే ఒక్కొక్క సిమ్ కు ఒక్కొకటి ఉంటుంది. అయితే సహజంగా దొంగతనాలకు పాల్పడిన వారే ఈ కోడ్ లను మారుస్తూ ఉంటారు. అటువంటి వారికి టెలికాం డిపార్ట్మెంట్ హెచ్చరిక జారీ చేసింది.

ఈ పని చేస్తే 50లక్షల జరిమానా, మూడేళ్ళ జైలు శిక్ష

ఐఎంఈఐ నెంబర్లను మార్చే చర్యలకు పాల్పడిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, లేదా 50 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొంది. లేదంటే ఈ రెండు శిక్షలు కలిపి కూడా విధించే అవకాశం ఉందని డాట్ వార్నింగ్ ఇచ్చింది. సెల్ ఫోన్ తయారీ సంస్థలు, బ్రాండ్ యజమానులు, దిగుమతి దారులు, విక్రయశాలల నిర్వహకులు ఐఎంఈఐ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు ఇచ్చింది.

ఇలా చేయటం టెలికాం సైబర్ సెక్యూరిటీ చట్టానికి వ్యతిరేకం

ఐఎంఈఐ మార్చిన సెల్ ఫోన్లు, మోడెమ్ లు, మాడ్యూల్స్, సిమ్ బాక్సులను తెలిసి కూడా కలిగి ఉండడం నేరమని పేర్కొంది. ఇక వీటిని మార్చడానికి ఉపయోగించే పరికరాలను కలిగి ఉండడం కూడా టెలికాం సైబర్ సెక్యూరిటీ చట్ట నిబంధనలకు విరుద్ధమని వెల్లడించింది. దేశీయంగా తయారు చేసి విక్రయించే సెల్ ఫోన్లు, మోడెమ్ లు, మాడ్యూల్స్, సిమ్ బాక్సుల ఐఎంఈఐ నెంబర్లను ప్రభుత్వంతో తప్పనిసరిగా నమోదు చేయాలని డాట్ సూచించింది. అదేవిధంగా దిగుమతిదారులు కూడా డివైస్ సేతు పోర్టల్లో తమ ఉత్పత్తులను నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.