షుగర్​ లెవల్స్​ కంట్రోల్లో ఉండాలా? ఈ టిప్స్ పాటిస్తే చాలు

వేగంగా పెరుగుతున్న సమస్య డయాబెటిస్. ఈ డయాబెటిస్ శరీరంలో ఇన్సులిన్ తగినతంగా లేకపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక వ్యాధి. ఇది క్లోమం ద్వారా ఉత్పత్తి అవుతుంది.


ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. కానీ, సరైన ఆహారం, వ్యాయామం, మందుల సాయంతో దీన్ని నియంత్రణలో ఉంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని చిట్కాలతో రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. షుగరు పూర్తిగా తగ్గే వ్యాధి కాదు. నియంత్రణలో ఉంచుకోవటం చాలా అవసరం. దీని కోసం ఆహారంతో పాటుగా జీవనశైలి మార్పు చేసుకోవాలి.

షుగరు పెరిగితే శరీరంలోని అన్ని అవయవాల పైన ప్రభావం ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ పేరుకుపోవడం వల్ల గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎటువంటి శారీరక శ్రమ చేయకపోవడంతో కండరాలు గ్లూకోజ్​ను సరిగ్గా ఉపయోగించుకోలేవని నిపుణులు చెబుతున్నారు. అందుకే శారీరక శ్రమ తప్పనిసరంటున్నారు. ప్రతి 45 నిమిషాలకు కేవలం 10 స్క్వాట్​లు చేయాలని సిఫార్సు చేస్తున్నారు. తిన్న తర్వాత రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, తిన్న తర్వాత కేవలం 10 నిమిషాలు నడవడం వల్ల రక్తంలో చక్కెర దాదాపు 22 mg/dL తగ్గుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఆయుర్వేద నిపుణుల ప్రకారం, మునగ కాయలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

మునగకాయలు, వాటి ఆకులు ఇన్సులిన్ లాగా పనిచేస్తాయి. వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో చక్కెరను శక్తిగా మార్చడంలో సహాయపడతాయి. కాబట్టి, మునగాకును ప్రతిరోజూ రసం లేదా పొడి రూపంలో తీసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్ వారికి బార్లీ చాలా మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉసిరిలో విటమిన్ సి, క్రోమియం ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. ఉసిరి రసం లేదా తాజా ఉసిరిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల క్లోమం పనితీరు మెరుగుపడుతుంది. వేప పుల్లలు లేదా త్రిఫల పొడితో నోటి పరిశుభ్రతను కాపాడుకోవడం, ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటితో మెంతులు లేదా గుర్మార్ పొడిని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే, కూరగాయలు, తొక్కతీసిన పండ్లు, పప్పు ధాన్యాలు ఎక్కువగా తీసుకోవా లని సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.