తెలుగు రాష్ట్రాల నుంచి వందే భారత్ స్లీపర్ కు గ్రీన్ సిగ్నల్: రూట్, షెడ్యూల్, ధరలు.

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. ప్రయాణీకుల నుంచి వస్తున్న తాజా డిమాండ్ మేరకు కొత్త సర్వీసుల పైన కసరత్తు జరుగుతోంది. విజయవాడ నుంచి బెంగళూరుకు వయా తిరుపతి కొత్తగా వందేభారత్ రైలు త్వరలో పట్టాలెక్కేందుకు సిద్దమైంది.


ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి తొలి విడతలోనే రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లకు ఆమోదం దక్కింది. ఇందు కోసం రెండు రూట్లు ఫిక్స్ చేసారు. రాజధాని, దురంతో కంటే మెరుపు వేగంతో వందేభారత్ స్లీపర్ పట్టాలెక్కేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది.

ఏపీ, తెలంగాణ నుంచి రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు డిమాండ్ ఉన్న రూట్ల పైన తర్జన భర్జనల తరువాత ఒక నిర్ణయానికి వచ్చారు. ఒకటి సికింద్రాబాద్, మరొకటి విజయవాడ నుంచి నడపాలని డిసైడ్ అయ్యారు. వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 11 థర్డ్ ఎసి, 4 సెకండ్ ఎసి మరియు 1 ఫస్ట్ ఎసి కోచ్‌లు ఉంటా యి. రాజధాని, దురంతో కంటే వేగంగా ఈ రైళ్లు దూసుకెళ్లనున్నారు. సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ కి తొలి వందేభారత్ స్లీపర్ ప్రారంభం కానుంది. మొత్తం 1667 కి.మీ దూరాన్ని 20 గంటల కంటే తక్కువ సమయంలో చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. కాగా, తొలి విడతలో కాగా, న్యూఢిల్లీ-సికింద్రాబాద్ వందే భారత్ స్లీపర్ రైలు ఆగ్రా కాంట్, గ్వాలియర్, వీరాంగన లక్ష్మీ బాయి ఝాన్సీ, భోపాల్, ఇటార్సి, నాగ్‌పూర్, బల్హర్షా మరియు కాజిపట్ జంక్షన్ వంటి ఇతర ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణించనుంది.

ఇందులో థర్డ్ ఎసి కోచ్ ఛార్జీ దాదాపు రూ.3600, సెకండ్ ఎసి కోచ్ ఛార్జీ రూ.4800 మరియు ఫస్ట్ ఎసి కోచ్ ఛార్జీ దాదాపు రూ.6000 ఉంటుంది. ఈ రైలు న్యూఢిల్లీ నుండి రాత్రి 08:50 గంటలకు బయలుదేరి..మరుసటి రోజు ఈ రైలు రాత్రి 08:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకునేలా ప్రతి పాదనలు సిద్దం చేసారు. అదే విధంగా విజయవాడ నుంచి బెంగ ళూరుకు వందేభారత్ ఏర్పాటు పైన నిర్ణయం తీసుకున్నట్లు తెలు స్తోంది. ఏపీ నుంచి అయోధ్య, వారణాసి కి వందేభారత్ స్లీపర్ కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. సాధ్యం కాకుంటే మార్చిలో ప్రకటిం చే రెండో విడతలో కేటాయింపు దిశగా కసరత్తు జరుగుతోంది. వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్లాలెక్కిన తరువాత విజయవాడ నుంచి అయోధ్య, వారణాసి కి కేటాయింపు పైన తొలి రెండు విడతల్లోనే ప్రకటన ఉంటుందని కూటమి ముఖ్య నేతలు చెబు తున్నారు.

కాగా.. విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లు ప్రయాణించే మార్గంలోనే వందేభారత్ స్లీపర్ ను అయోధ్య కు కేటాయించేలా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. రాత్రి సమయంలోనే ఈ రైలు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ రైలు అందుబాటు లోకి వస్తే అయోధ్య, వారణాసి వెళ్లాలనుకునే తెలుగు ప్రజలకు వరంగానే భావించాలి. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ రెండు రైళ్లకు అధికారికంగా ఆమోద ముద్ర వేస్తూ వచ్చే వారం ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.