రాత్రి ఆలస్యంగా తింటే ఏమవుతుందో తెలిస్తే షాకే.. మళ్లీ ఆ తప్పు..

రోగ్యంగా ఉండటానికి పోషక ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన సమయంలో తినడం కూడా అంతే ముఖ్యం. మనలో చాలా మంది పని ఒత్తిడి, టీవీ చూడటం, స్నేహితులతో గడపడం వంటి వివిధ కారణాల వల్ల రాత్రి భోజనం ఆలస్యం చేస్తుంటారు.


అయితే రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరంలో ఎలాంటి అనారోగ్యకరమైన మార్పులు వస్తాయో తెలుసుకుందాం.

ఆలస్యంగా తింటే కొవ్వు..

రాత్రి ఆలస్యంగా తినడం అనేది దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హానికరం. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. రాత్రిపూట మన శరీరం శక్తిని చాలా తక్కువగా ఉపయోగిస్తుంది. కాబట్టి మనం ఆలస్యంగా లేదా ఎక్కువగా తిన్నప్పుడు, ఆ ఆహారం కరిగిపోకుండా శరీరంలో కొవ్వుగా నిల్వ అవుతుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం

రాత్రి ఆలస్యంగా తినడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. రాత్రి సమయాల్లో సహజంగానే జీర్ణక్రియ మందగిస్తుంది. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాక సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి, గుండెల్లో మంట వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, ఇన్సులిన్ స్థాయిలలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

నిద్ర – ఏకాగ్రత లోపం

రాత్రి ఆలస్యంగా తినడం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. భోజనం చేసిన వెంటనే నిద్ర రాకపోవడం వల్ల ఆలస్యంగా పడుకుంటారు. దీని కారణంగా ఉదయం సమయానికి నిద్రలేవలేక, రోజంతా అలసట, ఏకాగ్రత లేకపోవడం వంటి లక్షణాలతో బాధపడతారు. కొంతమందిలో నిద్ర లేకపోవడం వల్ల నిరాశ లక్షణాలు పెరిగే అవకాశం కూడా ఉంది.

మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం

బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, నిద్ర లేకపోవడం వంటి శారీరక సమస్యలన్నీ తరచుగా ఒత్తిడి, ఆందోళన, కోపం వంటి మానసిక సమస్యలకు దారితీస్తాయి. రాత్రిపూట ఆలస్యంగా తినడం అనేది దీర్ఘకాలంలో మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.

రాత్రి భోజనానికి సరైన సమయం ఏది?

ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి భోజనం వీలైనంత త్వరగా పూర్తి చేయడం ఉత్తమం.

మంచి సమయం: రాత్రి 9 గంటల లోపు భోజనం పూర్తి చేయడం మంచిది. లేదా కనీసం పడుకోవడానికి రెండు-మూడు గంటల ముందు తినాలి.

ఆహారం: రాత్రిపూట తేలికపాటి భోజనం తీసుకోవడం మంచిది. కూరగాయలు, సూప్, ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవచ్చు.

నియమం: రాత్రి భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు తేలికగా మారుతుంది మరియు నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.