నేటి నుంచే ఆన్‌లైన్‌లో Meta Ray-Ban Smart Glasses.. భారీ తగ్గింపు

మెటా రే-బాన్ జెన్ 1 స్మార్ట్ గ్లాసెస్‌ నవంబర్ 21 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.


ఈ సంవత్సరం మే నెలలో కంపెనీ ఈ గ్లాసులను భారతదేశంలో విడుదల చేసింది. ఎస్సిలోర్‌లక్సోటికాతో భాగస్వామ్యంతో మెటా ఈ గ్లాసులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. అయితే.. ఈ స్మార్ట్ గ్లాసెస్‌పై కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్‌లో మెటా రే-బాన్ జెన్ 1 స్మార్ట్ గ్లాసెస్ ప్రారంభ ధర రూ.29,900. ఈ స్మార్ట్ గ్లాసెస్ Rayban.com, ఇతర ప్రముఖ ఆప్టికల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. మీరు ఇప్పుడు వాటిని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, రిలయన్స్ డిజిటల్ నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను ₹22,920 ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. వీటిపై 20% బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ డిసెంబర్ 1 వరకు చెల్లుబాటు అవుతుంది.

ప్రత్యేకతలు ఏంటి..?
ఈ గ్లాసెస్ వినియోగదారులకు హ్యాండ్స్-ఫ్రీ ఎక్స్​పీరియన్స్​ను అందిస్తాయి. ఇవి మెటా AIతో లింక్ అయి ఉంటాయి. దీంతో ప్రయాణ సమయంలో వీటిని ఏవైనా ప్రశ్నలు అడిగి రియల్​-టైమ్ సమాధానాలను పొందొచ్చు. ఇవి ట్రాన్స్​లేట్ చేయడం, ఇతర AI-ఆధారిత ఫీచర్లను అందించడం వంటివి కూడా చేయగలదు. ఇవి వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లతో ఎంగేజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా మ్యూజిక్​ వినడానికి కూడా వీలు కల్పిస్తాయి. ఈ రే-బాన్ మెటా స్మార్ట్‌గ్లాసెస్ రెండు సంవత్సరాల క్రితం (సెప్టెంబర్ 2023) ప్రపంచ మార్కెట్లో లాంఛ్ అయ్యాయి. కంపెనీ నుంచి వచ్చిన మొట్ట మొదటి స్మార్ట్​గ్లాసెస్​ పేరు ‘రే-బాన్ స్టోరీస్‌’. వీటిని మెటా సెప్టెంబర్ 2021లో అమెరికాలో ప్రవేశపెట్టింది.

ఈ ఏడాది మేలో భారతదేశంలో విడుదల చేసింది. దీంతో ఆసియాలో మెటా రే-బాన్ మెటా గ్లాసెస్‌ను ప్రారంభించిన మొదటి మార్కెట్‌గా భారతదేశం మారింది. ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను భారత్​లో విడుదల చేయడం ద్వారా మెటా దేశీయ మార్కెట్​లో క్వెస్ట్ VR హెడ్‌సెట్స్ వంటి ఇతర ఉత్పత్తులను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మెటా క్వెస్ట్ ఉత్పత్తులు అమెజాన్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో థర్డ్-పార్టీ సెల్లర్స్​ ద్వారా భారత్​లో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్​లో మెటా స్మార్ట్ గ్లాసెస్ అనేక స్టైల్స్​లో అందుబాటులో ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.