పైరసీ సైట్ ‘ఐబొమ్మ’ కేసులో ఇమంది రవికి కోర్టు రోజుల పోలీసు కస్టడీ విధించిన విషయం తెలిసిందే. నేడు రెండోరోజు విచారణ ముగిసింది. సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని 5-6 గంటల పాటు ప్రశ్నించారు.
ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండోరోజు విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక అంశాలు రాబట్టారు. ఐబొమ్మ రవికి సినిమాలు సప్లై చేస్తున్న వారి వివరాలను పోలీసులు సేకరించారు. తమిళ, హిందీ వెబ్‌సైట్స్ ద్వారా మూవీలను రవి కొనుగోలు చేశాడు. ‘మూవీ రూల్స్’ అనే వెబ్‌సైట్ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
క్రిప్టో కరెన్సీ దారా మూవీ రూల్స్‌కి ఇమంది రవి డబ్బులు పంపినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ని బెట్టింగ్ యాప్స్ కి గేట్ వే చూపెడుతున్నాడు. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులతో రవి సినిమాలు కొనుగోలు చేశాడు. వ్యూయర్స్ పెంచుకోవడానికి క్వాలిటీ కంటెంట్‌ని పోస్ట్ చేస్తున్నాడు. కరేబియన్ దీవుల్లో ప్రత్యేకంగా ఆఫీసు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. 20 మంది యువకులను నియమించి ఐబొమ్మలో కంటెంట్‌ని రవి పోస్ట్ చేయిస్తున్నాడు. రేపు కూడా రవిని పోలీసులు విచారించనున్నారు. మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
































