వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాలేయానికి అత్యంత ప్రమాదకరమైన ఆహారం, మనం సాధారణంగా సీడ్ ఆయిల్ అని పిలిచే నూనెలు. వీటిని ఆహార పరిశ్రమలలో అధిక వేడిలో ప్రాసెస్ చేస్తారు.
ఈ ప్రక్రియలో ఈ నూనెలు పెట్రోల్‌లో కనిపించే హెక్సేన్ అనే ద్రావకంతో కలుస్తాయి. ఇది వీటిని ప్రమాదకరంగా మారుస్తుంది.
ప్రమాదకరమైన సీడ్ ఆయిల్స్: సోయాబీన్ ఆయిల్, కనోలా ఆయిల్, మొక్కజొన్న నూనె, పత్తి గింజల నూనె, పొద్దుతిరుగుడు నూనె, ద్రాక్ష గింజల నూనె వంటి నూనెలు ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.
ఈ నూనెలు దాదాపు ప్రతి ఆహారంలోనూ కనిపిస్తాయి. రెస్టారెంట్లలో వేయించిన ఆహారం, చిప్స్, స్నాక్స్, ప్రోటీన్ బార్‌లు, మయోనిస్ ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో వీటిని విరివిగా వాడతారు. ఈ నూనెలు కొవ్వు కణాలు, కాలేయంలోకి లోతుగా వెళ్లి సంవత్సరాల తరబడి అక్కడే ఉంటాయి. దీనివల్ల కాలక్రమేణా ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.
ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సీడ్ ఆయిల్స్‌కు బదులుగా వంట కోసం వెన్న, ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెలను ఉపయోగించడం మంచిది. అలాగే వేరుశెనగ నూనె కూడా కాలేయానికి ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
సప్లిమెంట్: ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు TUDCA (ఒక రకమైన బోరిక్ యాసిడ్) ను వైద్యుల సలహా మేరకు ఉపయోగించవచ్చు. ఇది కాలేయ వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే దీనిని తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి.



































