ఇలాంగ్ ఎసెన్షియల్ ఆయిల్ సహజమైన హెయిర్ పెర్ఫ్యూమ్‌గా చెప్తారు. ఇది తీపి, విదేశీ సువాసనను ఇస్తుంది. ఇది స్కాల్ప్‌పై నూనె ఉత్పత్తిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.
జుట్టును మృదువుగా, మెరిసేలా, జీవంతో నిండి ఉండేలా చేస్తుంది. మీ సీరం లేదా వాటర్ స్ప్రేలో ఒకటి లేదా రెండు చుక్కలు వేయడం వల్ల మీ జుట్టు సువాసనతో ఉంటుంది.
రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ స్కాల్ప్‌లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కుదుళ్లను స్ట్రాంగ్‌గా చేసి జుట్టు పలుచబడటాన్ని తగ్గిస్తుంది. చలికాలంలో జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడేవారికి ఇది మంచి ఆప్షన్.
లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ పొడిబారిన, దురదగా ఉండే చర్మానికి అనుకూలంగా ఉంటుంది. దీని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చికాకును తగ్గిస్తాయి. జుట్టుకు మంచి సువాసన అందిస్తాయి.
లెమన్ ఆయిల్ తలలోని మురికిని తొలగించి.. తాజాదనాన్ని అందిస్తుంది. అధిక నూనె, చుండ్రును నియంత్రిస్తుంది. దీని సిట్రస్ స్మెల్ తక్షణమే మూడ్‌ను మెరుగుపరుస్తుంది. తలను శుభ్రంగా, పునరుత్తేజితంగా ఉంచుతుంది.
2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్‌ను 3-4 చుక్కల రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్, 1 టీస్పూన్ జోజోబా ఆయిల్‌తో కలపండి. నిద్రపోయే ముందు తలపై మసాజ్ చేయండి. ఇది జుట్టు కుదుళ్లను పోషిస్తుంది. చలికాలంలో పొడిబారడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
50 ml నీటిలో 1 టీస్పూన్ తాజాగా తీసిన నిమ్మరసం, 2-3 చుక్కల టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. షాంపూ చేసిన తర్వాత స్కాల్ప్‌కి పట్టించండి. చుండ్రును నియంత్రించడానికి, దురదను తగ్గించడానికి, స్కాల్ప్ తాజాగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది.
1 టేబుల్ స్పూన్ తేలికపాటి కొబ్బరి నూనెను 2 చుక్కల ఇలంగ్ ఎసెన్షియల్ ఆయిల్‌తో కలపండి. తడి జుట్టు చివర్ల వరకు కొద్దిగా రాస్తే జుట్టు చిట్లడాన్ని తగ్గిస్తుంది. జుట్టుకు మెరుపును అందిస్తుంది.
































