తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి. ఏపీ, తెలంగాణలో సంక్రాంతిని పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ప్రతీ ఏటా సంక్రాంతి సెలవులను ప్రభుత్వాలు ముందుగానే ప్రకటిస్తాయి.
పదో తరగతి, ఇంటర్ ఫైనల్ పరీక్షల షెడ్యూల్ ను ఇప్పటికే వెల్లడించాయి. ఇక.. జనవరి 13,14,15 తేదీల్లో సంక్రాంతి పండగ జరుపుకుంటారు. కాగా, ఈ సారి సెలవులకు సంబంధించి విద్యా శాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు.
సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. సొంత గ్రామాలకు వెళ్లి ఈ పండుగను జరుపు కుంటారు. దీంతో, ఈ పండుగ సెలవులను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ఇప్పటికే సంక్రాంతి సెలవుల తేదీలను నిర్ధారించింది. జనవరి 10 నుండి జనవరి 18, 2026 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. మొత్తం 9 రోజులు సెలవులు ఉంటాయి. జనవరి 19, 2026న తరగతులు తిరిగి ప్రారంభమవుతాయి. తెలంగాణలో ప్రభుత్వం ఇదే విధంగా సెలవులను ఖరారు చేసే అవకాశం ఉంది. తెలంగాణలో జనవరి 10 నుండి జనవరి 15, 2026 వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చేందుకు తొలుత ప్రతిపాదనలు చేసారు. అయితే, ఇప్పుడు ఏపీ తరహాలోనే సెలవుల పైన అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.
కాగా, సంక్రాంతి పండగలకు ఊళ్లకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్స్ చేస్తారు. రైల్వే, ఆర్టీసీ సైతం సంక్రాంతికి ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. దీంతో.. ముందస్తుగా రైళ్లు, బస్సు టికెట్స్‌ను బుక్ చేసుకుంటున్నారు. సంక్రాంత్రికి ఇంకా నెలకుపైగా రోజులు ఉన్నప్పటికీ రైళ్ల టికెట్స్ అన్ని కూడా బుక్ అయిపోయాయి. ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు వర్తిస్తాయి. విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకునే అవకాశం కల్పిస్తుంది. అదనంగా పాఠశాలలు జనవరి 23న వసంత పంచమి/సరస్వతీ పూజ/సుభాష్ చంద్రబోస్ జయంతి, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవులు ఉన్నాయి. జనవరి 14న భోగి, జనవరి 15న సంక్రాంతి, జనవరి 16న కనుమ. జనవరి 17, 2026న ముక్కనుమ ఇలా వరుసగా పండగను జరుపుకుంటారు.



































