ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య అధికబరువు. బరువు నియంత్రణ కోసం రకరకాల టిప్స్, డైట్స్ ఫాలో అవుతూ చాలా కష్టపడుతుంటారు. అయితే వెయిట్ లాస్ అంటే జిమ్‌లో చెమటోడ్చడం, డైట్ పేరుతో కడుపు మాడ్చుకోవడం అనేది అందరికీ తెలిసిందే. కానీ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఒక సింపుల్ ఈటింగ్ హ్యాక్‌తో ఈ సమస్యకు సొల్యూషన్ ఇచ్చింది.
కష్టపడి వర్కౌట్ చేయకుండా, కేవలం ఒక చిన్న హ్యాబిట్ మార్చడంతోనే బరువు కంట్రోల్‌లోకి తెచ్చుకోవచ్చని చెబుతోంది. స్టార్ హీరోయిన్ చెప్పిన ఈ సీక్రెట్ వైరల్ అవుతోంది, ఎందుకంటే అది సైన్స్ బ్యాక్డ్, ఈజీ టు ఫాలో. ఈ హ్యాక్ ఆమె స్లిమ్ ఫిగర్‌కు కీలకమైనది, మరి మీరు కూడా ట్రై చేస్తారా?
ఏంటా సీక్రెట్..
ఆ బాలీవుడ్ బ్యూటీ చెప్పిన సీక్రెట్ ఏంటంటే.. ఆహారాన్ని సరైన పద్ధతిలో తినడం. అంటే నిదానంగా పూర్తిగా ఆహారాన్ని మెత్తగా నమలాలి. ఇంతకీ ఈ హ్యాక్ చెప్పింది ఎవరనుకుంటున్నారు? ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. ఇటీవల ‘పరమ్ సుందరి’ మూవీ ప్రమోషన్‌లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి రోడ్‌సైడ్ స్నాక్స్ తింటూ ఈ హ్యాక్‌ని వివరించింది.
చిన్న పోర్షన్‌లలో తీసుకుని, ఒక్కో బైట్‌ను జాగ్రత్తగా నములుతూ తినాలని సూచించింది. ఇదే తన డైట్ సీక్రెట్ అని చెప్పుకొచ్చింది. అదే విషయంపై కాలిఫోర్నియా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పల్ మానిక్కం కూడా మాట్లాడారు. ‘ఒక్కో బైట్‌కు 32 సార్లు నమలాలి. ఎందుకంటే మనకు 32 పళ్లు ఉన్నాయి’ అని ఆయన సూచించారు.
ఆహారాన్ని నెమ్మదిగా నమలడం వల్ల గట్, బ్రెయిన్ మధ్య కమ్యూనికేషన్ మెరుగవుతుంది. వాగస్ నర్వ్ ద్వారా ‘నేను ఫుల్ అయ్యాను’అనే సిగ్నల్స్ వస్తాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది, సాటియేటీ హార్మోన్స్ లాంటి లెప్టిన్ పెరుగుతాయి, హంగర్ హార్మోన్ ఘ్రెలిన్ తగ్గుతుంది. ఫలితంగా, ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది, క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి, పోర్షన్ సైజ్ అటోమేటిక్‌గా రెడ్యూస్ అవుతుంది. బెనిఫిట్స్? బెటర్ డైజెషన్, లెస్ క్యాలరీ ఇంటేక్, ఆహారాన్ని మరింత ఎంజాయ్ చేస్తూ తినొచ్చు.. అన్నింటికీ మించి జిమ్ లేకుండానే వెయిట్ లాస్ అవచ్చన్నమాట!
జాన్వీ డైట్, వర్కౌట్స్‌తో బాడీ మెయింటేన్ చేస్తోంది. కానీ ఈ చూయింగ్ హ్యాక్ ఆమెకు స్పెషల్. ‘చిన్న పోర్షన్‌లు తీసుకుని స్లోగా తినడం వల్ల హంగర్ కంట్రోల్ అవుతుంది’ అని చెప్పుకొచ్చింది. జాన్వీ చెప్పినదానిపై డాక్టర్ మానిక్కం కూడా ప్రాక్టికల్ టిప్స్ ఇచ్చారు.
‘15-15-15 రూల్: ఒక బైట్ తీసుకుని 15 సెకండ్స్ నమిలి, 15 సెకండ్స్ పాజ్ ఇవ్వడం, మీల్‌కు కనీసం 15 నిమిషాలు పడేలా చేయడం. ఫోన్ సైడ్‌కి పెట్టి, రిలాక్స్‌గా తినాలి. ఇది ఒక మీల్ (బ్రేక్‌ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్) నుంచి స్టార్ట్ చేయాలి’ అని చెప్పుకొచ్చారు డాక్టర్ మానిక్కం. మీరు కూడా ఈ సీక్రెట్ ఫాలో అవుతూ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయండి!
































