బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (Dharmendra) తుదిశ్వాస విడిచిన రోజే యాదృచ్ఛికంగా ఆయన చివరి సినిమా ‘ఇక్కీస్’ (Ikkis) చిత్రం పోస్టర్‌ను చిత్రనిర్మాణ సంస్థ మడాక్ ఫిల్స్మ్ విడుదల చేసింది.
ఈ చిత్రంలో ధర్మేంద్ర ‘ఫస్ట్‌లుక్’ సోమవారం ఉదయం విడుదలైంది. అగస్త్య నందా హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అతనికి తండ్రిగా ధర్మేంద్ర నటిస్తున్నారు. అగస్త్య నంద బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు కావడం విశేషం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతోంది.
‘ఇక్కిస్’ చిత్రం 1971లో ఇండో-పాక్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. అరుణ్ ఖేత్రపాల్ అతి చిన్న వయస్సులోనే పరమ వీర చక్ర అందుకున్నారు. దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకుడు.































