కేరళను మించిన అందాలు.. హైదరాబాద్ నుంచి 50 కి. మీ. దూరంలోనే..

హెదరాబాద్ టెకీలకు అదిరిపోయే వార్త.. బిజీ లైఫ్ లో బోర్ కొట్టిందా..? వీకెండ్ లో సినిమాలతోనే గడిపేస్తున్నారా..? కేరళ, కొడైకెనాల్, అందాలను వీక్షించాలని ఉన్నా..


సమయం లేదని బాధపడుతున్నారా..? అయితే హైదరాబాద్ కు కేవలం 50 కి. మీ దూరంలోనే నర్సాపూర్ అర్బన్ పార్క్ ఇప్పుడు పర్యటకులను ఆకర్షిస్తోంది. 250 ఎకరాల పచ్చదనంతో నర్సాపూర్ అడవులు ఇప్పుడు నగరవాసులకు బెస్ట్ డెస్టినేషన్ గా మారింది. ఇక్కడి కాటేజీలు, స్విమ్మింగ్ పూల్స్, డైనింగ్ ప్రాంతాలు.. టూరిస్టూలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రైవేట్ రిసార్ట్స్ కు పోటీగా రాష్ట్ర ప్రభుత్వమే వీటిని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతోంది.

మెదట్ జిల్లాలోని నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఈ అర్బన్ పార్క్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కు దగ్గరలో అప్పటి ప్రభుత్వం రూ. 13 కోట్లతో ఈ పార్క్ ను పబ్లిక్- ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ విధానంలో అభివృద్ధి చేసింది. పర్యటకుల కోసం కాటేజీలు, రిసెప్షన్ సెంటర్, స్విమ్మింగ్ పూల్ తదితర నిర్మాణాలను అప్పట్లోనే వేగవంతంగా నిర్మించారు. ఇక పార్కులో వేదికలను కూడా ఏర్పాటు చేశారు. ఈ పార్కు పెద్దలు, పిల్లలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కు మంచి పిక్నిక్ స్పాట్ గా మారింది.

హైదరాబాద్ కు నర్సాపూర్ అర్బన్ పార్క్ కేవలం 50 కి. మీ. దూరంలోనే ఉన్న క్రమంలో వీకెండ్ వచ్చిందంటే చాలు నగరవాసులు ఇక్కడికి వందల సంఖ్యలో వచ్చేస్తున్నారు. ఉదయం వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక్కడికి దగ్గరలోనే పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఏడుపాయల వనదుర్గా ఆలయం, మెదక్ చర్చి ఉంటుంది. వీటిని కూడా టూరిస్టులు ఆస్వాదించవచ్చు. ఇక ఈ అర్బన్ పార్క్ లో రాత్రంతా బస చేసేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక్కడే ఏర్పాటు చేసిన వాచ్ టవర్ నుంచి వ్యూ పాయింట్ అద్భుతంగా ఉంటుంది. వ్యూ పాయింట్ నుంచి నర్సాపూర్ అటవీ ప్రాంతం మొత్తాన్ని తనివితీరా ఆస్వాదించవచ్చు. హైదరాబాద్ కు కూతవేటు దూరంలోనే ఉన్న ఈ అటవీ పార్కును మీరు కూడా సందర్శించండి..

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.