రోజుకొక్కటి చొప్పున ఈ సూపర్ ఫుడ్స్ తీసుకుంటే చాలు బాస్

కుకూరల్లో ఆరోగ్యానికి అవసరం అయ్యే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బతువా నుండి మెంతి వరకు దాదాపు అన్ని రకాల ఆకుకూరలు పోషకాల గనులు.


ప్రత్యేకించి- శీతాకాలంలో రోజూ ఆకు కూరలను తీసుకోవడం వల్ల కొన్ని రకాల సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చు. ఆకుకూరల్లో సహజ సిద్ధంగా ఉండే ఐరన్, కాల్షియం, విటమిన్లు ఏ, సీ, కే వంటి ముఖ్యమైన పోషకాలు శరీరానికి కావాల్సిన ఎనర్జీ, రోగనిరోధక శక్తిని అందిస్తాయి.

1. బతువా

శీతాకాలంలో లభించే ఆకుకూర ఇది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, అమినో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియ మెరుగుపడటానికి సహాయపడుతుంది. వంద గ్రాముల బతువా ఆకుల్లో 36 గ్రాముల వరకు కేలరీలు ఉంటాయి. ఇందులో 4.5 గ్రాముల ప్రోటీన్, 6.2 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3.8 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. కాల్షియం, విటమిన్ సీ అధికం. కాల్షియం ఎముకల బలానికి, విటమిన్ సీ యాంటీఆక్సిడెంట్ రక్షణకు తోడ్పడతాయి.

2. మెంతి:

చలికాలంలో మెంతి కూరను రోజూ తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రతను కాపాడుకోవచ్చు. తరచూ చోటు చేసుకునే కాళ్ల వాపు, తిమ్మిర్లను తగ్గించవచ్చు. మెంతి ఆకు వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో కూడా ఇది సహాయపడుతుంది. వంద గ్రాముల మెంతి ఆకుల్లో 49 కేలరీలు, 4.4 గ్రాముల ప్రోటీన్, 6 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1 గ్రాము కొవ్వు ఉంటాయి.

3. బచ్చలికూర:

బచ్చలికూర ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉండే ఆకుకూర. 100 గ్రాముల బచ్చలికూరలో 23 కేలరీలు, 2.9 గ్రాముల ప్రోటీన్, 2.7 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల ఫైబర్ ఉంటాయి. బచ్చలికూర కాల్షియం, విటమిన్ సీ అధికం. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఎముకల సాంద్రతను పెంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ప్రేగు కదలికలను పెంచుతుంది. ఫలితంగా మలబద్ధకం నుంచి విముక్తి పొందవచ్చు.

4. ఆవాల ఆకుకూర:

100 గ్రాముల ఆవాల ఆకుకూరల్లో 27 కేలరీలు, 2.7 గ్రాముల ప్రోటీన్, 4.7 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1.1 గ్రాముల ఫైబర్, 102 మి.గ్రా కాల్షియం, 70 మి.గ్రా విటమిన్ సీ ఉంటాయి. విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే ఈ ఆకుకూర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, శీతాకాలపు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

5. తోటకూర:

తోటకూర, భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పోషకమైన ఆకుకూర. 100 గ్రాములకు, ఇందులో 23 కేలరీలు, 3 గ్రాముల ప్రోటీన్, 4 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల ఫైబర్, 215 మి.గ్రా కాల్షియం, 43 మి.గ్రా విటమిన్ సీ ఉంటాయి. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.

6. కాలీఫ్లవర్:

వంద గ్రాముల పచ్చి కాలీఫ్లవర్లో సుమారు 49 కేలరీలు, 4.3 గ్రాముల ప్రోటీన్, 8.8 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 0.9 గ్రాముల కొవ్వు ఉంటాయి. ఈ కూరగాయ విటమిన్ కే, సీ, ఏ ఎక్కువగా ఉంటాయి ఇందులో. కాలీఫ్లవర్ ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తుంది. శరీరంలో వాపును తగ్గిస్తుంది. కూరగాయల్లో ఉండే ఇతర పోషకాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, రక్తపోటును నిర్వహించడంలో సహాయపడతాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.