నవంబర్ 25వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఇవే… తులం పసిడి ధర రూ. 8000 తక్కువగా పలుకుతోంది

నేడు నవంబర్ 25వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,27,560 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,100 పలుకుతోంది.


ఒక కేజీ వెండి ధర రూ. 1,58,184 పలుకుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే నేడు బంగారం ధర భారీగా పెరిగింది. బంగారం ధర భారీగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులే కారణమని చెప్పవచ్చు. అమెరికన్ డాలర్ విలువ క్షీణత కూడా బంగారం ధర పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. నిజానికి బంగారం ధరలు మార్కెట్లో భారీగా తగుముఖం పట్టినట్లే పట్టి మళ్ళీ పెరగడం ప్రారంభించాయి.

బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వు డిసెంబర్ నెలలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని వార్తలు జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరగడం గమనించవచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గించినట్లయితే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితంగా భావించే బంగారం వైపు తరలించే అవకాశం ఉంటుంది. ఫలితంగా బంగారం ధరలు భారీగా పెరగడం గమనించవచ్చు. మరోవైపు బంగారం లో పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం పెరుగుతున్న ధర ఉత్సాహం ఇస్తుంది అని చెప్పవచ్చు. అయితే అదే సమయంలో బంగారం ఆభరణాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి మాత్రం పెరుగుతున్న ధరలు చుక్కలు చూపిస్తున్నాయి అని చెప్పవచ్చు. బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేక పెరుగుతాయా అని అంశం డిసెంబర్లో జరిగే ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయం పైనే ఆధారపడి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

బంగారం ధరలు నిజానికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి గమనించినట్లయితే భారీగా పెరిగినట్లు చూడవచ్చు. ఈ సంవత్సరం జనవరి నెలలో బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాములకు గాను సుమారు 75 వేల రూపాయల సమీపంలో ఉంది. అక్కడి నుంచి బంగారం ధర ఏకంగా అక్టోబర్ నెలలో 1.35 లక్షల రూపాయలకు చేరుకుంది. అక్కడి నుంచి నెమ్మదిగా మళ్లీ తగ్గడం చూడవచ్చు. బంగారం ధర భారీగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు కారణమని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి విధానాల వల్ల బంగారం ధరలు భారీగా పెరగడం ప్రారంభించాయి. దీనికి తోడు డాలర్ విలువ పట్టణం కూడా బంగారం ధర పెరగడానికి దోహదపడింది అని చెప్పవచ్చు. అదే సమయంలో వెండి ధరలు కూడా పెరగడం చూడవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.