టాటా తన ఐకానిక్ సియెర్రాను(Tata Sierra) రంగ ప్రవేశం చేయించింది. ఆకట్టుకునే డిజైన్, మెరుగైన ఫీచర్లతో ప్రత్యర్థి కార్ మేకర్స్‌కి ఛాలెంజ్ విసురుతోంది.
తక్కువ ధరలతో, ఎక్కువ ఫీచర్లు అందించే టాటా మరోసారి అదే చేసి చూపించింది. మిడ్ సైన్ SUV ధరల్ని టాటా మోటార్స్ వెల్లడించింది. సియెర్రా తబేస్ వేరియంట్ ప్రారంభ ఎక్స్ షోరూం ధరను రూ. 11.49 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. బుకింగ్స్ డిసెంబర్ 16, 2025న అధికారికంగా ప్రారంభించింది. డెలివరీలను జనవరి 15, 2026 నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పింది.
ఫీచర్లు:
టాటా తన ట్రేడ్ మార్క్ డాక్సీ సిల్హౌట్ డిజైన్‌తో సియెర్రాను తీసుకువస్తోంది. ఫ్లష్ ట్లేజింగ్, డాష్ బోర్డుపై 3- స్క్రీన్ డిస్‌ప్లేని అందిస్తోంది. తొలిసారిగా టాటా తన కార్లలో త్రీ స్క్రీన్ సెటప్‌ని ఇస్తోంది. పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లను ఇస్తోంది. కనెక్టెడ్ LED DRLలు, 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్, బాడీ క్లాడింగ్ రూఫ్ రేయిల్స్ మరింత అట్రాక్టివ్‌గా కనిపించబోతున్నాయి. వెంటిలేటెడ్ సీట్స్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, టూ స్టేజ్ రిక్లైనింగ్ రియర్ సీట్లు, ఎక్స్‌ప్రెస్ కూలింగ్‌తో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎంపిక చేసిన వేరియంట్‌లలో ప్యాడిల్ షిఫ్టర్లు, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 14 వ్యూస్‌తో 360-డిగ్రీల కెమెరా, రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. 12- స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్ మరో ప్రత్యేకత.
ఇంజన్ ఆప్షన్స్:
టాటా సియోర్రా పెట్రోల్, డిజిల్ వేరియంట్లలో వస్తోంది. కొత్తగా 1.5 లీటర్ TGDi హైపెరియన్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను తీసుకువస్తోంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 160 bhp పవర్, 255 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్‌తో కూడా అందుబాటులో ఉంది, ఇది 106 bhp, 145 Nm పవర్ కలిగి ఉంటుంది.
డిజిల్ వేరియంట్‌లో 1.5 లీటర్ కైరోజెట్ ఇంజన్ ఉంటుంది. ఇది మన్యూవల్ గేర్ బాక్స్‌తో ఇది 118 bhp, 260 Nm పవర్‌ను ఇస్తుంది. ఆటోమేటిక్ 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే కాకుండా ఆల్ టర్రైన్ సామర్థ్యం కోసం ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్‌ను త్వరలోనే సియెర్రా లైనప్‌లో చేర్చుతామని టాటా చెబుతోంది. సియోర్రా అధునాతన లెవల్-2 ADASను కలిగి ఉంటోంది.
































