ఏపీ మహిళలలూ.. నెలకు పదిహేను వందలు కావాలంటే ఇలా చేయల్సిందే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలోనే మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు పదిహేను వందల రూపాయలు మహిళలకు ఇస్తామని హామీ ఇచ్చారు.


అయితే ఈ పథకం అమలు చేయాలంటే నిధులు అవసరమని భావించిన ప్రభుత్వం గత కొద్ది రోజుల నుంచి వాయిదా వేసుకుంటూ వస్తుంది.

ఇచ్చిన హామీలను

అయితే మహిళలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. సంక్షేమంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని చెప్పనున్నారు. మరొకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో ఆడబిడ్డ పథకాన్ని అమలు చేసి, మహిళ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు…

మహిళలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ‘ఆడబిడ్డ నిధి’ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకం ద్వారా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులైన లబ్ధిదారుల డేటా పరిశీలన, బ్యాంక్ లింకేజీ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు సమాచారం. మొదటి విడత నిధుల విడుదల తేదీని ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.