పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్(pakistan-ex-pm-imran-khan) జైలులో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.
జైళ్లో ఉన్న ఆయన్ని కలవడానికి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. దీంతో ఆయన చనిపోయి ఉంటాడనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇమ్రాన్ ఖాన్‌ను జైళ్లో చంపేశారా అని ఆయన కుటుంబ సభ్యులు నిలదీస్తున్నారు. ఈ పుకార్ల నేపథ్యంలో ఆయన సోదరీమణులు, ఇమ్రాన్ ఖాన్‌ను కలవాలని డిమాండ్ చేస్తున్నారు. అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. మూడు వారాలుగా తమ సోదరుడిని కలవడానికి అనుమతించడం లేదని అతడి సోదరీమణులు ఆరోపిస్తున్నారు.
పాకిస్తాన్ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఆయన చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల తర్వాత, పాక్ ప్రభుత్వం ఒక నెల నుంచి సమావేశాలపై అప్రకటిత నిషేధం విధించింది. చివరకు ఖైబర్ ఫఖ్తుంఖ్వా సీఎం సోహైల్ అఫ్రిదిని కూడా ఇమ్రాన్ ఖాన్(imran khan news)ను కలిసేందుకు అనుమతించలేదు. 7 సార్లు ప్రయత్నించినప్పటికీ, జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు.



































