తీవ్ర అల్పపీడనం..రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరోసారి బిగ్ అలర్ట్. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.


రేపు, ఎల్లుండి ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం, నేడు వాయుగుండంగా బలపడబోతున్నట్లు వెల్లడించింది వాతావరణ శాఖ. ఈ వాయుగుండం ఈనెల 29వ తేదీ నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. దీని ఎఫెక్ట్ కారణంగా ఏపీలో వర్షాలు పడతాయని అంచనా వేసింది.

రేపు మోస్తారు వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పడే ఛాన్స్ ఉందట. ఎల్లుండి రాయలసీమ, దక్షిణకోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఉత్తర కోస్తా లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేసింది. తీరం వెంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వివరిస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి నేపథ్యంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని కూడా సూచనలు చేసింది. ఏపీలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో భిన్న పరిస్థితులు ఉన్నాయి.

మొన్నటి వరకు విపరీతమైన చలి తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా కనిపించింది. చాలా ప్రాంతాల్లో ఐదు నుంచి పది మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే గత నాలుగు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత కాస్త తగ్గింది. దీంతో తెలంగాణ ప్రజలకు కాస్త ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని పటాన్చెరువు ప్రాంతంలో 17 డిగ్రీలు, మెదక్ 13.5 డిగ్రీలు, నిజామాబాద్ 17.6 డిగ్రీలు, రామగుండంలో 17.5 డిగ్రీలు, హైదరాబాద్ మహానగరంలో 18.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు గత నాలుగు రోజులుగా నమోదు అవుతున్నాయి. అలాగే మహబూబ్ నగర్ లో 19.1 డిగ్రీలు, ఖమ్మంలో 20.4 డిగ్రీలు, నల్లగొండలో 18.2 డిగ్రీలు, భద్రాచలంలో 21 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.