ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా.
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సూపర్ హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నాడు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ నుండి రానున్న ఈ సినిమా హీరోగా రామ్ కెరీర్ లో 22వ సినిమా.
వరుస ప్లాప్స్ లో ఉన్న రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో హిట్ కొడతానని చాలా ధీమాగా ఉన్నాడు. గత రాత్రి ప్రీమియర్స్ తో ఓవర్సీస్ లో రిలీజ్ అయిన ఆంధ్ర కింగ్ తాలూకా ఎలా ఉందంటే.. ఫస్టాఫ్ ఒక స్టార్ కు – ఫ్యాన్ కు సంబంధం చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్సే కెమిస్ట్రీ చాలా బాగుంది. చాలా ఇన్నోసెంట్ గా ఫీల్ గుడ్ ఎమోషన్ తో సాగుతుంది. ప్రీ-ఇంటర్వెల్ హుక్ బాగుంది మరియు కానీ స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉంటుంది.కొత్తగా అనిపించదు కానీ బాగుంది. అయితే సెకండాఫ్ సబ్ ప్లాట్స్ తో కథకి సంబంధం లేకుండా సాగుతాయి. ఇక ఓవరాల్ గా చూస్తే రామ్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా అంటే చాలా బెటర్. ముఖ్యంగా రామ్ నటన, డాన్స్ సూపర్ గా ఉన్నాయి. దర్శకుడు మహేష్ మరో మంచి కథ రాసుకున్నాడు. కానీ ఇంకా బాగా తీయచ్చు అని అనిపించింది. డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. ఉపేంద్ర హీరోగా సూపర్ గా నటించాడు. రావు రమష్ మెప్పించారు. సాంగ్స్ & బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమా లెంగ్త్ కాస్త ఎక్కువ అనిపిస్తుంది. ఒక్కమాటలో రామ్ హిట్ కొట్టినట్టే అని చెప్పాలి.
































