మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర హోంశాఖ శుభవార్త చెప్పింది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (Chiranjeevi Charitable Trust)ను ఎఫ్సీఆర్ఏ కింద నమోదుకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది.
విదేశీ విరాళాలు స్వీకరించేందుకు ట్రస్టుకు వెసులుబాటు కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. చారిటబుల్ ట్రస్టు కింద బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 కింద నమోదు చేసుకుని ఎఫ్సీఆర్ఏ అనుమతి తీసుకోవాలని ఇటీవల నిబంధనల్లో మార్పు చేశారు. నిబంధనల మార్పుతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కేంద్రం అనుమతి కోరింది. ట్రస్ట్ విజ్ఞప్తికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆమోద ముద్రవేసినట్టు సమాచారం. 1998లో ఈ ట్రస్టును స్థాపించిన విషయం తెలిసిందే. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్, ముఖ్యంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మరియు ఐ బ్యాంక్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తోంది.



































