ఫ్లైట్‌లో ప్రయాణం అంటే స్పీడ్, కంఫర్ట్… కానీ భద్రత మాత్రమే నంబర్ వన్! ఒక్క చిన్న తప్పు.. బ్యాగ్‌లో ఒక్క అనుమతి లేని వస్తువు ఉంటే భారీ జరిమానా, ఫ్లైట్ మిస్, లేదా లీగల్ ఇష్యూ కూడా రావచ్చు.
కొబ్బరికాయ నుంచి సాఫ్ట్ చీజ్ వరకు, పవర్ బ్యాంక్ నుంచి బ్లీచింగ్ పౌడర్ వరకు… ఇంటర్నేషనల్ ఏవియేషన్ రూల్స్ (IATA & DGCA) ప్రకారం కొన్ని వస్తువులను పూర్తిగా నిషేధించాయి.
విమానంలో ప్రయాణించాలంటే ఏ వస్తువులు తీసుకెళ్లకూడదో ముందే తెలుసుకుంటే ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ లేకుండా జర్నీని ఎంజాయ్ చేయొచ్చు! నిషేధ వస్తువులు తీసుకెళ్తే రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా, లేదా జైలు శిక్ష కూడా పడొచ్చు. ఆ వస్తువులేంటో మీరూ తెలుసుకోండి..
* ఫ్లైట్‌లో అస్సలు తీసుకెళ్లని వస్తువుల్లో ఒకటి కొబ్బరికాయ (Whole Coconut).దీని లోపలి ద్రవం స్కానర్‌లో కనిపించదు కాబట్టి పేలుడు పదార్థమా అని డౌట్ వస్తుంది. కొబ్బరి ముక్కలు మాత్రం ఓకే!
* సాఫ్ట్ చీజ్.. ఇది జెల్ లాంటి టెక్స్చర్ కాబట్టి 100 మి.లీ. రూల్ కింద హ్యాండ్ బ్యాగ్‌లో నో. చెక్-ఇన్ లగేజీలోనూ కొన్ని దేశాలు బ్యాన్ చేస్తాయి.
* డ్యూరియన్ పండు .. దీని దుర్వాసన వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడతారు కాబట్టి సింగపూర్, థాయ్‌లాండ్ ఎయిర్‌లైన్స్ పూర్తి బ్యాన్ విధించాయి.
*32,000 mAh పైన ఉండే పవర్ బ్యాంక్ అనుమతి లేదు. 27,000-32,000 mAh మధ్య ఉంటే అనుమతిస్తారు, అంతకంటే ఎక్కువ ఉంటే పేలుడు రిస్క్ కాబట్టి అనుమతి లేదు!
* స్పోర్ట్స్ పారాచూట్.. ఇది ‘పారాచూట్’ కాబట్టి సెక్యూరిటీ రిస్క్‌గా భావిస్తారు. ప్రొఫెషనల్ స్కై డైవర్లకు మాత్రమే స్పెషల్ పర్మిషన్ ఉంటుంది.
* లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్.. వైద్యం కోసమైనా అనుమతి లేదు. చిన్న పోర్టబుల్ కాన్సంట్రేటర్స్ తప్ప లిక్విడ్ ఆక్సిజన్ ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించరు.
* స్మార్ట్ లగేజీలో రిమూవబుల్ కాని బ్యాటరీ అనుమతి లేదు. బ్యాటరీ తీసేయలేకపోతే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్లైట్‌లో అనుమతి లేదు.
* బ్లీచింగ్ పౌడర్, లిక్విడ్ బ్లీచ్ .. రసాయనికంగా రియాక్ట్ అయ్యే పదార్థాలు కాబట్టి పూర్తి నిషేధం. గన్ షేప్ లైటర్స్, టాయ్ గన్స్.. ఆకారం గన్ లాగా ఉంటే భయాందోళన కలిగిస్తుంది కాబట్టి నో ఎంట్రీ. స్విమ్మింగ్ పూల్ క్లోరిన్ ట్యాబ్లెట్స్ .. ఇవి ఆక్సిడైజర్ కాబట్టి పేలుడు రిస్క్. ఎంత తక్కువ మొత్తమైనా నిషేధం.
పై విషయాలు తెలుసుకుని ప్రయాణిస్తే ఎయిర్‌పోర్ట్‌లో ఇబ్బంది పడక్కర్లేదు. ఫ్లైట్‌లో ప్రయాణించాలంటే జాగ్రత్తలు తప్పనిసరి – ఎందుకంటే, ఆకాశంలో భద్రతకు రాజీ లేదు!
































