బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీలు చేయడం మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. జీతం అందుకోవడం నుండి బిల్లులు చెల్లించడం వరకు ప్రతిదీ బ్యాంక్ అకౌంట్పైనే ఆధారపడి ఉంటుంది.
అయితే సడన్‌గా మీ అకౌంట్ క్లోజ్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి? వామ్మో.. పనుల్ని ఆగిపోయతాయని కదూ. లక్షలాది మంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవచ్చు. నవంబర్ 30లోపు వారి KYC అప్డేట్ చేయకుంటే, వారి సేవింగ్స్ అకౌంట్లు తాత్కాలికంగా నిలిపివేస్తామని బ్యాంక్ స్పష్టంగా హెచ్చరించింది.
KYC ఎందుకు అవసరం?
KYC తప్పనిసరి బ్యాంకింగ్ ప్రక్రియ, దీని ద్వారా బ్యాంకులు తమ కస్టమర్ల గుర్తింపు, చిరునామాను ధృవీకరిస్తాయి. మోసాన్ని నిరోధించడం, మనీలాండరింగ్‌ను అరికట్టడం ఆర్థిక నేరాలను నిరోధించడం. ఖాతాలు సరైన వ్యక్తి పేరు మీద ఉన్నాయని బ్యాంకులు నిర్ధారిస్తాయి. కస్టమర్ సమాచారం పాతది లేదా అప్డేట్ కాకుండా ఉంటే బ్యాంక్ వారిని KYC చేయమని అడుగుతుంది. KYC పెండింగ్‌లో ఉన్న తన కస్టమర్లందరికీ PNB స్పష్టమైన సూచనలు జారీ చేసింది. నవంబర్ 30 నాటికి మీరు మీ పత్రాలను అప్డేట్ చేయకుంటే, బ్యాంక్ మీ ఖాతాను “నాన్-ఆపరేటివ్” కేటగిరీలో ఉంచనుంది. ఒక వేళ అలా చేస్తే మీ అకౌంట్లో లక్షలు ఉన్నా కూడా ఒక్క రూపాయి వినియోగించుకోలేరు.
ఎలా అప్డేట్ చేసుకోవాలి?
- కస్టమర్ల సౌలభ్యం కోసం PNB మీ KYC అప్డేట్ కోసం అనేక సులభమైన మార్గాలను అందించింది. మీరు బ్యాంకుల కోసం పొడవైన లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచే అప్డేట్ చేయొచ్చు.
- సమీపంలోని బ్యాంకు శాఖను సందర్శించడం అనేది అత్యంత సాంప్రదాయ, సురక్షితమైన పద్ధతి. మీరు మీ ఖాతాను తెరిచిన హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి మీ ఆధార్ కార్డ్, ఇటీవలి ఫోటో, మీ PAN కార్డ్ లేదా ఫారమ్ 60, అవసరమైతే ఆదాయ రుజువుతో పాటు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఇవ్వాలి.
- PNB ONE యాప్‌లో.. మీరు బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ (PNB ONE) ఉపయోగిస్తుంటే, దాని ద్వారా కూడా e-KYC ప్రక్రియను పూర్తి చేయవచ్చు. యాప్‌లోకి లాగిన్ అయి సూచనలను అనుసరించండి.
- ఇంటర్నెట్ బ్యాంకింగ్ (IBS) ద్వారా: PNB ఆన్లైన్ బ్యాంకింగ్ (ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్) యాక్సెస్ ఉన్న కస్టమర్లు లాగిన్ అయి ‘వ్యక్తిగత సెట్టింగ్‌లు’ లేదా ‘ప్రొఫైల్’ విభాగానికి వెళ్లి KYC అప్డేట్ ఎంపికను ఎంచుకోవచ్చు.
- రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా పోస్ట్ ద్వారా: కొన్ని సందర్భాల్లో, మీరు మీ KYC పత్రాల ధృవీకరించబడిన కాపీలను మీ హోమ్ బ్రాంచ్‌కు వారి రిజిస్టర్డ్ ఇమెయిల్ IDకి లేదా పోస్ట్ ద్వారా కూడా పంపవచ్చు.
































