బంగాళాఖాతంలో మరో తుఫాను.. భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో కొత్త తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో వాయుగుండం ఏర్పడిందని..


అది తుఫాను మారుతోందని ప్రకటించింది. దీనికి దిట్వా తుఫానుగా నామకరణం చేశారు.ఈ తుఫాను నవంబర్ 30 నాటికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి-దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తీరప్రాంత రాష్ట్రాలలోని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇప్పటికే శ్రీలంకలో భారీ వర్షాలతో కూడిన ఈదురుగాలులు ప్రారంభమయ్యాయని.. ఎపి, తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వాతావరణ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని అధికారులు కోరారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.