మీ ఇంట్లోకి స్మార్ట్‌టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ఇదే గోల్డెన్ ఛాన్స్.. ఏకంగా 50 శాతం తగ్గింపు.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి పలు ఈ కామర్స్ వెబ్‌సైట్లలో బ్లాక్ ఫ్రైడే సేల్ గత కొద్దిరోజులుగా నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తున్నారు.


మొబైల్స్, టీవీల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ మొత్తంలో తగ్గింపు ఇస్తున్నారు. దీంతో బ్లాక్ ఫ్రైడ్ సేల్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ సేల్‌లో భారీగా ఆఫర్లు ఉన్నాయి. దీంతో టీవీ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయమని చెప్పవచ్చు. శాంసంగ్ స్మార్ట్‌టీవీలపై అమెజాన్ ఏకంగా 50 శాతం వరకు భారీ తగ్గింపు ఇస్తోంది. ఆ ఆఫర్ల వివరాలు ఇవే..

శాంసంగ్ క్రిస్టల్ 4K అల్ట్రా HD స్మార్ట్ టీవీ

49 శాతం తగ్గింపుతో రూ.71,990కే ఈ టీవీ లభిస్తుంది. 4K డిస్‌ప్లేతో ఉన్న ఈ టీవీలో వాయిస్ అసిస్టెంట్‌ ఫీచర్ ఉంది. ఇది Samsung Tizen OS ఆధారంగా పనిచేస్తుంది. ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్‌తో కూడిన 20W సౌండ్ మెరుగైన ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. దీనికి Wi-Fi, HDMI, USB లాంటి డివైజ్‌లు కనెక్ట్ చేసుకోవచ్చు.

శాంసంగ్ విజన్ AI 4K స్మార్ట్‌టీవీ

55 అంగుళాల శాంసంగ్ విజన్ AI 4K స్మార్ట్ QLED టీవీ 46 శాతం తగ్గింపుతో ఇప్పుడు ₹ 43,990కే లభిస్తుంది. QLED డిస్‌ప్లే ఉండటంతో క్లారిటీగా స్క్రీన్ అనుభవాన్ని పొందవచ్చు. ఇక Q4 AI ప్రాసెసర్ స్క్రీన్ నాణ్యతను మరింత పెంచుతుంది. ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్, 20W సౌండ్, Wi-Fi, AirPlayతో పాటు బహుళ కనెక్టివిటీ పోర్ట్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

శాంసంగ్ క్రిస్టల్ 4K విస్టా స్మార్ట్‌టీవీ

శాంసంగ్ 43 అంగుళాల క్రిస్టల్ 4K విస్టా స్మార్ట్ LED టీవీ ఇప్పుడు 35 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. కేవలం రూ.25,490కే ఇది లభిస్తుంది. 4K డిస్‌ప్లేతో పాటు 20W సౌండ్, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. Wi-Fi, HDMI, USB కనెక్టివిటీని అందిస్తుంది. తక్కువ ధరలో మంచి స్మార్ట్‌టీవీ కావాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక

శాంసంగ్ HD స్మార్ట్ టీవీ

శాంసంగ్ 32 అంగుళాల HD స్మార్ట్ LED టీవీ ఇప్పుడు 27 శాతం తగ్గింపుతో కేవలం రూ. 12,990కే అమెజాన్‌లో వస్తుంది. హెచ్‌డీ డిస్‌ప్లేతో కూడిన ఈ టీవీ మెరుగైన ఆడియో అనుభూతిని అందిస్తుంది. ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్, 20W సౌండ్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. Wi-Fi, HDMI, USB కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.