పేరెంట్స్.. ఉద్యోగులకు కీలక అప్డేట్. మరో నెల రోజుల్లో ఈ ఏడాది పూర్తి కానుంది. డిసెంబర్ లో క్రిస్మస్ సెలవులను ఇప్పటికే పాఠశాలలు ఖరారు చేసాయి. ఇక..
జనవరి 1వ తేదీ నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న వేళ 2026 సంవత్సరానికి సంబంధించి కేంద్రం సెలవుల జాబితాను ప్రకటించింది. సెలవుల్లో టూర్లు.. ఇతర కార్యక్రమాలు ఫిక్స్ చేసుకొనే వారి కోసం ఈ సెలవుల జాబితా ఉపకరిస్తుంది. అయితే.. ప్రస్తుత సంవత్సరం కంటే వచ్చే ఏడాది సెలవులు భారీగా పెరిగాయి.
కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి వర్తించే సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ క్యాలెండర్లో జాతీయ సెలవుల నుండి ముఖ్యమైన పండుగల వరకు అన్ని ప్రత్యేక రోజులు ఉన్నాయి. జనవరి నుండి డిసెంబర్ వరకు మొత్తం సెలవులను పరిశీలిస్తే 2026 సెలవుల క్యాలెండర్లో 14 తప్పనిసరి సెలవులు, 12 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. జనవరి 1 నూతన సంవత్సరం, 14న సంక్రాంతి, 23న వసంత పంచమి, 26న ఘనతంత్ర దినోత్సవం సెలవులను ఖరారు చేసారు. ఫిబ్రవరి-1 న గురు రవిదాస్ జయంతి, 15న మహాశివరాత్రి, 19న ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించారు. మార్చి-4న హోలీ, 19న ఉగాది, మార్చి 21న రంజాన్, 26న శ్రీరామ నవమి, 31న మహావీర్ జయంతి సెలవులు నిర్ణయించారు.
కాగా, ఏప్రిల్ -3న గుడ్ ఫ్రైడే, 5న ఈస్టర్, 14న అంబేద్కర్ జయంతి సెలవులు ఇచ్చారు. మే -1 న బుద్ద పౌర్ణమి, 9న రవీంద్రనాథ ఠాగూర్ జయంతి, 27న బక్రీద్ సెలవు ప్రకటించారు. జూన్ 26 న మొహర్రం సెలవు ఇచ్చారు. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం,26న మిలాద్ ఉన్ నబ, 26న ఓణం , 28న రక్షాబంధన్ సెలవులు ఖరారు చేసారు. సెప్టెంబర్ 4న జన్మాష్టమి,14న వినాయక చవితి సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి, 18,19,20 తేదీల్లో దసరా సెలవులు ప్రకటించారు. కాగా.. పాఠశాలలకు దసరా సెలవులు మరిన్ని పెరుగుతాయి. నవంబర్ 8న దీపావళి, 15న చఠ్ పూజ, 24న గురు నానక్ జయంతి సెలవులు ఉన్నాయి. డిసెంబర్ 25న క్రిస్మస్ సెలవు ఉండనుంది. వీటితో పాటుగా 52 ఆదివారాలు 12 రెండవ శనివారాలు ఉన్నాయి. మొత్తం మీద విద్యార్ధులకు 100 రోజులు సెలవులు రానున్నాయి.
































