ప్రయాణికులు మరో గుడ్ న్యూస్ తెలిపింది ఇండియన్ రైల్వే. ఇకపై సదరన్ రైల్వే నాన్-ఏసీ స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు కూడా దిండు, దుప్పటి, బెడ్ షీట్ ఇవ్వనున్నారు.
కాగా ఈ సౌకర్యం 2026 జనవరి 1 నుంచి అందుబాటులోకి రానుంది. అయితే ఏసీ కోచ్‌లలో ఉచితంగా ఇచ్చే ఈ బెడ్‌రోల్ సౌకర్యాన్ని స్లీపర్ ప్రయాణికులకు మాత్రం ఛార్జ్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రూ.50 (బెడ్‌షీట్ + దిండు + దుప్పటి), రూ.30 (దిండు + దుప్పటి), రూ.20 (బెడ్‌షీట్) అనే మూడు ప్యాకేజీలుగా నిర్ణయించారు.
ఈ సేవను ముందుగా చెన్నై డివిజన్‌లో ఎంపిక చేసిన 10 ప్రముఖ రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని అన్నారు. TTE ద్వారా రైలులోనే లేదా టికెట్ బుకింగ్ సమయంలోనే ఆప్షన్ ఎంచుకుని ఈ సౌకర్యం పొందవచ్చునని తెలిపారు. ఈ సౌకర్యంతో రాత్రి ప్రయాణాల్లో ఎక్కువ మంది స్లీపర్ ప్రయాణికులు సొంత దుప్పట్లు తీసుకువెళ్లే ఇబ్బంది తొలగిపోనుంది. అలాగే రైల్వేకు కూడా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.



































